Fiber Net Scam: గత టీడీపీ హయాంలో ఫైబర్ నెట్ కుంభకోణం చోటుచేసుకుంది. అప్పటి లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో ఈ అక్రమాలకు తెరలేవడం సంచలనం సృష్టించింది. సుమారు రూ.2 వేల కోట్ల మేర అవినీతి జరిగిందని సీఐడీ అధికారులు తేల్చేశారు. ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ వేగవంతం చేశారు. మాజీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్ కు చెందిన టెరా సాఫ్ట్ వేర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు టెంబర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు అతిక్రమించారని తెలుస్తోంది.
ఈ కేసులో విచారణ ముమ్మరం చేసేందుకు కేసులో సంబంధం ఉన్న వ్యక్తులను పిలిపించారు. అందులో హరిప్రసాద్ తో పాటు ఇన్ ఫ్రాస్ర్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ, ఎండీగా పనిచేసిన సాంబశివరావు హాజరయ్యారు. ఈ రోజు సాంబశివరావును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయన రాష్ర్టంలో పని చేసేందుకు డిప్యుటేషన్ మీద వచ్చారు. కేంద్ర రైల్వే సర్వీసులకు చెందిన సాంబశివరావు ఏపీలో డిప్యుటేషన్ మీద వేశారు.
టెరా సాఫ్ట్ కోసం కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించేందుకు వక్రమార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిపుణుల ఆభ్యంతరాలను బేఖాతరు చేసి రూ.330 కోట్ల విలువైన ఫైబర్ నెట్ టెండర్లు కట్టబెట్టారని విచారణలో వెల్లడయింది. సుమారు రూ.2 వేల కోట్ల కుంభకోణంలో దర్యాప్తు జరుగుతున్నా నిజాలు మాత్రం అరకొర బయటకు వస్తున్నాయి. దీంతో విచారణలో వేగం కనిపించడం లేదు.
అవినీతికి పాల్పడిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ టీడీపీ ప్రభుత్వంలో ఇ గవర్నెన్స్ అథారిటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగారు. సాంబశివరావు నాటి ఇన్ ఫ్రాస్ర్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ-ఎంపీ సహా మొత్తం 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో కేసు పురోగతి సాధిస్తుందని భావించినా ఆచరణలో కనిపించడం లేదు. రూ.2 వేల కోట్ల విలువైన పనులకు మొదట రూ.330 కోట్లకు ఫైబర్ నెట్ కార్పొరేషన్ 2015లో ఇన్ క్యాప్ ద్వారా టెండర్లు పిలిచినా టెండర్ల దాఖలుకు 2015 జులై 31 గడువు విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
కానీ ఒక రోజు ముందు జులై 30న టెండర్ల దాఖలు గడువును ఆగస్టు 7 వరకు పొడిగించింది. ఆ రోజు నాటికి ప్రభుత్వ బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరా సాఫ్ట్ సంస్థ టెండర్ దాఖలు చేయకపోవడమే అందుకు కారణం. ఫైబర్ నెట్ కార్పొరేషన్ కు టెరా సాఫ్ట్ సరఫరా చేసిన పరికరాలు నాసిరకంగా ఉన్నాయి. టెండర్ నిబంధనలు పాటించకపోయినప్పటికి నిబంధనలు విరుద్దంగా బిల్లులు చెల్లించారు. రూ.119.98 కోట్ల మేర నష్టం జరిగినట్లు సీఐడీ విచారణలో తేలింది. ఇందులో లోకేష్ టీం బాధ్యులుగా గుర్తించారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Fiber net scam irts sambasivarao arrested in ap fiber net scam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com