Nara Lokesh: నేటి కాలంలో తల్లిదండ్రులను చాలామంది భారంగా భావిస్తున్నారు. కట్టుకున్న భార్యను సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇలాంటి పాడు దినాలలో అతడు ఒక దీపశిఖ. అతను చేస్తున్న పని.. చూపిస్తున్న ప్రేమ.. కనబరుస్తున్న ఆప్యాయత ఎంతో గొప్పది.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కి చెందిన రామమూర్తికి 60 సంవత్సరాలకు పైగా వయసు ఉంటుంది. ఇతడికి భార్య.. తల్లి ఉన్నారు. పిల్లల గురించి మాత్రం తెలియదు. రామమూర్తి భార్య సొంతంగా పనులు చేసుకోలేదు. వైకల్యం వల్ల ఆమె పూర్తిగా నీరసపడిపోయింది. ఆమెకు తినిపించాలి. తాగించాలి. చివరికి స్నానం కూడా చేయించాలి. ఇక ఆయన తల్లి పరిస్థితి కూడా అంతే. ఆమెకు కనీసం కూర్చోవడానికి కూడా శరీరం సహకరించదు. వీరిద్దరిని రామమూర్తి కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు. కన్నబిడ్డల లాగా కాపాడుకుంటున్నాడు.
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రామమూర్తి గురించి బయట ప్రపంచానికి చెప్పారు. ఇన్ స్టా గ్రామ్ చూస్తున్న నారా లోకేష్ కు అనుకోకుండా ఈ వీడియో కనిపించింది. ఆ వీడియో చూస్తున్నంత సేపు తాను ఎంతగానో భావోద్వేగానికి గురయ్యానని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ” నేను సామాజిక మాధ్యమాలలో రామమూర్తి గారి వీడియోను అనుకోకుండా చూశాను. అది నా మనసును తీవ్రంగా కదిలించింది. ఆయన ఈ వయసులో కూడా తన వృద్ధ తల్లిని.. దివ్యాంగురాలైన భార్యను ప్రేమతో చూసుకుంటున్నారు. అంకిత భావాన్ని కనబరుస్తున్నారు. ఆయన చూపిస్తున్న ప్రేమ ఎంతో గొప్పది. రామమూర్తి గారు మీ కుటుంబం పట్ల మీకున్న కర్తవ్య భావన అద్భుతం అంటూ” నారా లోకేష్ ట్వీట్ చేశారు.
నారా లోకేష్ ట్వీట్ చేయడమే కాదు.. గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ ఉంటే.. కచ్చితంగా అందేవిధంగా చూడాలని కోనసీమ కలెక్టర్ కు సూచించారు. దీంతో అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. రామమూర్తి కుటుంబం వద్దకు వెళ్లారు. అతనికి ప్రభుత్వపరంగా పథకాలు అందించడం మాత్రమే కాకుండా.. ఆ వృద్ధులు సమర్థవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాదు రామమూర్తికి ఒక ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ నారా లోకేష్ చేసిన ట్వీట్ రామమూర్తి కష్టాలను తీర్చింది. ఆయనకు కొండంత అండను ప్రభుత్వం నుంచి అందించింది.
I stumbled upon this video of Ramamurthy garu on Instagram, and it shook me to the core. At his age, the love and devotion with which he continues to care for his elderly mother and differently-abled wife is deeply moving. Ramamurthy garu, your sense of duty towards your family… pic.twitter.com/5C9TJ63Kf1
— Lokesh Nara (@naralokesh) August 12, 2026