spot_img
Homeఅత్యంత ప్రజాదరణసాగు చట్టాలపై పార్లమెంట్ లో మోడీ సంచలన వ్యాఖ్యలు

సాగు చట్టాలపై పార్లమెంట్ లో మోడీ సంచలన వ్యాఖ్యలు

రైతుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా సంచలన ప్రకటన చేశారు. రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. సమష్టిగా సమస్యలను చర్చించుకొని పరిష్కరించుకోవాలని మోడీ రైతులకు పిలుపునిచ్చాడు. చిన్న, సన్నకారు రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. పంట బీమా యోజనను మరింత విస్తరిస్తామని తెలిపారు. కనీస మద్దతు ధరలో ఎలాంటి మార్పులు ఉండవని.. చెబుతున్నా రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారో తెలియట్లేదని మోడీ వాపోయారు. కొత్త చట్టాల్లో అభ్యంతరాలు ఏంటో చెప్పట్లేదని అన్నారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోడీ రాజ్యసభలో సుధీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్ధానికి మార్గనిర్ధేశనం చేసిందని మోడీ కొనియాడారు. కరోనా సంక్షోభాన్ని భారత్ సమర్థంగా ఎదిరిస్తోందని మోడీ అన్నారు. కరోనాపై పోరులో అనేక దేశాలకు అండగా నిలుస్తున్నామన్నారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్లు పంపిస్తున్నామన్నారు. కరోనాపై విజయం దేశప్రజలదన్నారు.

ప్రపంచ దేశాల్లోనే అగ్రరాజ్యంగా భారత్ ఎదగడానికి ఇదే సరైన సమయం అని.. దాన్ని అందిపుచ్చుకోవడానికి అన్ని చర్యలను తీసుకుంటున్నామని ప్రధాని మోడీ అన్నారు. భారత్ ప్రస్తుతం ‘ల్యాండ్ ఆఫ్ అపార్చునిటీస్’గా మారిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కరోనాతో వచ్చిన ఆర్థికసంక్షోభం భారత్ మరింత బలపడడానికి ఉపయోగపడిందని మోడీ అన్నారు. ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు సాగుతున్నామన్నారు. ప్రపంచ ఔషధ కేంద్రంగా భారత్ అవతరించిందని.. ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందన్నారు. మానవాళి రక్షణకు భారత్ చేసిన ప్రయత్నాలను ప్రపంచం మెచ్చుకుంటోందన్నారు. ఉగ్రవాదంపై పోరు, టీకా సహా భారత్ బలం ప్రపంచానికి తెలిసిందని మోడీ చెప్పుకొచ్చారు.

దశాబ్ధాలుగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు లేవని.. తాము చేస్తున్నామని మోడీ అన్నారు.. రైతుల సంక్షేమానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందుకే వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టి కొత్త సాగు చట్టాలు తీసుకొచ్చామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి స్పష్టం చేశారు. గతంలో ఈ సంస్కరణలకు అనుకూలంగా ఉన్న ప్రతిపక్షాలు ఇప్పుడు కావాలనే చట్టాలను వ్యతిరేకిస్తున్నారని ప్రధాని విమర్శించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Oktelugu Epaper