Homeబిజినెస్Telugu Rich Families: తెలుగు రాష్ట్రాల్లో సంపన్న కుటుంబాలు ఇవే.. వీరి చేతిలో ఉన్న సంపద...

Telugu Rich Families: తెలుగు రాష్ట్రాల్లో సంపన్న కుటుంబాలు ఇవే.. వీరి చేతిలో ఉన్న సంపద ఎంతంటే..

Telugu Rich Families: సంపద గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు ముఖేష్ అంబానీ నామాన్ని జపం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ముఖేష్ సంపాదన ఆ స్థాయిలో ఉంటుంది మరి. అతని కంపెనీలు.. వచ్చే ఆదాయం.. సొంతం చేసుకునే లాభాలు.. చేస్తున్న వ్యాపారాలు ఒక స్థాయిలో ఉంటాయి. ముకేశ్ అంబానీ మాత్రమే కాదు.. టాటాలు.. బిర్లాలు.. ఆదానీలు.. మహీంద్రా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వ్యాపారులు లక్షల కోట్లకు ఎదిగిన […]

Telugu Rich Families: సంపద గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు ముఖేష్ అంబానీ నామాన్ని జపం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ముఖేష్ సంపాదన ఆ స్థాయిలో ఉంటుంది మరి. అతని కంపెనీలు.. వచ్చే ఆదాయం.. సొంతం చేసుకునే లాభాలు.. చేస్తున్న వ్యాపారాలు ఒక స్థాయిలో ఉంటాయి.

ముకేశ్ అంబానీ మాత్రమే కాదు.. టాటాలు.. బిర్లాలు.. ఆదానీలు.. మహీంద్రా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వ్యాపారులు లక్షల కోట్లకు ఎదిగిన వారు ఉన్నారు. నేటి ఆధునిక కాలంలో కొత్త కొత్త వ్యాపారాలు చేస్తున్నవారు లక్షల కోట్లను దాటేస్తున్నారు. కొత్త తరానికి కొత్త వ్యాపారం అన్నట్టుగా.. విభిన్నమైన రంగాలలో తమ సత్తాను చాటుకుంటూ అదరగొడుతున్నారు. దేశంలో ఉన్న ప్రఖ్యాతమైన వ్యాపారవేత్తల విషయాన్ని కాస్త పక్కన పెడితే… మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న టాప్ సంపన్న కుటుంబాలను ఒకసారి పరిశీలిస్తే..

దేశంలో ఇటీవల ఓ సంస్థ టాప్ 300 రిచెస్ట్ కుటుంబాల జాబితాను విడుదల చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇందులో డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ కి చెందిన ప్రసాద్ 13,300 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. బయోలాజికల్ ఈ సంస్థకు సంబంధించి మహిమ దాట్ల 22 వేల కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. నవయుగ కన్స్ట్రక్షన్స్ 17,200 కోట్లు.. అమరాజా కంపెనీ రామచంద్ర గళ్ళ 15,500 కోట్ల సంపాదన కలిగి ఉన్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో తొలి తరం ఈ వ్యాపార కుటుంబాలను ఒకసారి పరిశీలిస్తే.. దివిస్ లేబరేటరీస్ 1,74,700 కోట్లు.. అరబిందో ఫార్మా 95,200 కోట్లు.. పి పి రెడ్డి 90, 100 కోట్ల తో టాప్ 3 లో కొనసాగుతున్నారు.

సంపన్న కుటుంబాలు ఎక్కువగా ఫార్మ.. ఆటోమొబైల్.. రియల్ ఎస్టేట్.. కన్స్ట్రక్షన్స్ వంటి విభాగాలలో వ్యాపారాలు చేస్తున్నాయి. ఈ కుటుంబాలకు హెల్త్ కేర్.. హాస్పిటాలిటీ.. ఇంకా అనేక రంగాలలో వ్యాపారాలు ఉన్నాయి. సప్లై డిమాండ్.. ఆధునికత.. ప్రొడక్షన్. ఇంకా రకరకాల విధానాలలో ఈ కుటుంబాలు వ్యాపారాలు సాగిస్తున్నాయి. అందువల్లే విపరీతంగా ఆర్జిస్తున్నాయి. ఈ కుటుంబాలు రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నాయంటే వీరి వ్యాపారం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫార్మా కంపెనీల నిర్వాహకులు భారీగా లాభాలు ఆర్జిస్తూ లక్షల కోట్లకు ఎదిగిపోతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper