Jabardasth Sujatha: ఈటీవీ లో గత 12 ఏళ్లుగా ప్రసారం అవుతున్న ‘జబర్దస్త్’ కామెడీ షో ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ప్రతీ బుధ , గురువారాల్లో టెలికాస్ట్ అయ్యే ఈ షో , ఆ తర్వాత శుక్రవారం శనివారం కి మారింది. ఇప్పుడు ప్రతీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం అవుతోంది. ఈ షో నుండి ఎంత కమెడియన్స్ ఇండస్ట్రీ లోకి వచ్చారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొంతమంది కమెడియన్స్ రాజకీయాల పరంగా డివైడ్ కూడా అయ్యారు. అయితే ఎవరు ఏ పార్టీ లో ఉన్నప్పటికీ కూడా ప్రతీ కమెడియన్ నాగబాబు గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన రుణం తీర్చుకోలేము అనే స్థాయిలో చెప్తుంటారు. అయితే అదే జబర్దస్త్ కి చెందిన సుజాత మాత్రం నాగబాబు గారి గురించి నాకు పెద్దగా తెలియదు అంటూ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘ నాగబాబు గారి గురించి నాకు ఎక్కువగా తెలియదు. ఎందుకంటే తాను జబర్దస్త్ షో లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నాగబాబు గారు లేరు, కానీ ఆయన బయట రెండు మూడు సందర్భాల్లో ఆయన్ని కలిసినప్పుడు నన్ను చాలా ఆప్యాయత తో పలకరించారు, ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ లోని నా నటన ని ఆయన మెచ్చుకున్నారు, జెమినీ టీవీ లో ఒక ప్రోగ్రాం లో కలిసినప్పుడు ఈ అమ్మాయి చాలా చలాకీ గా మాట్లాడుతూ ఉంటుంది. నీ గురించి , రాకేష్ గురించి మీడియా లో వింటున్న మాటలు నిజమేనా అమ్మా అని అడిగారు. నాగబాబు గారు చాలా ఆప్యాతతో ఉంటారు అందరితో. కానీ నాకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఇప్పటి వరకు రాలేదు’ అంటూ చెప్పుకొచ్చింది సుజాత. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
ఇక సుజాత ఎక్కువగా ‘జోర్దార్ సుజాత’ గా ఫేమ్ ని సంపాదించుకుంది. న్యూస్ రీడర్ గా తెలంగాణ యాసలో ఈమె చెప్పే వార్తలకు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. అలా వచ్చిన ఫేమ్ తో ఈమె ‘బిగ్ బాస్’ రియాలిటీ షో లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఆడియన్స్ కి ఇంకా బాగా దగ్గరైంది. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె , కాలం గడిచే కొద్దీ అందులో కమెడియన్ గా చేస్తున్న రాకింగ్ రాకేష్ తో ప్రేమలో పడడం , ఆ తర్వాత పెళ్లి చేసుకొని పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో కూడా ఈమె బాగా ఫేమస్.