Homeప్రవాస భారతీయులుIndian Culture: ఇండియన్స్ ప్రేమ అలా ఉంటుంది మరి.. కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ బామ్మ.....

Indian Culture: ఇండియన్స్ ప్రేమ అలా ఉంటుంది మరి.. కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ బామ్మ.. వైరల్ వీడియో

Indian Culture: సంప్రదాయం.. సంస్కృతి.. కట్టుబాట్లు.. గౌరవప్రదమైన జీవితం.. ఉన్నతమైన విధానాలు.. వీటన్నింటికీ భౌతికపరమైన రూపం ఇస్తే అది ముమ్మాటికి భారతీయుల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సరే భారతీయులు తమ హుందాతనాన్ని.. తమ మార్క్ ప్రదర్శిస్తూ ఉంటారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వివాహం చేసుకున్నది మన భారతీయురాలిని. అమెరికాలోని గత ప్రభుత్వంలో ఉపాధ్యక్షురాలుగా కొనసాగింది కమలా హారిస్.. వీరంతా కూడా భారతీయ మూలాలు ఉన్నవారు. వీరి నేపథ్యం చాలా గొప్పది. వీరి […]

Indian Culture: సంప్రదాయం.. సంస్కృతి.. కట్టుబాట్లు.. గౌరవప్రదమైన జీవితం.. ఉన్నతమైన విధానాలు.. వీటన్నింటికీ భౌతికపరమైన రూపం ఇస్తే అది ముమ్మాటికి భారతీయుల రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సరే భారతీయులు తమ హుందాతనాన్ని.. తమ మార్క్ ప్రదర్శిస్తూ ఉంటారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వివాహం చేసుకున్నది మన భారతీయురాలిని. అమెరికాలోని గత ప్రభుత్వంలో ఉపాధ్యక్షురాలుగా కొనసాగింది కమలా హారిస్.. వీరంతా కూడా భారతీయ మూలాలు ఉన్నవారు. వీరి నేపథ్యం చాలా గొప్పది. వీరి హుందాతనం అద్భుతమైనది. అందువల్లే కదా అంతటి అమెరికా దేశంలో వీరు తమ స్థాయిని చూపించారు. అమెరికా అధ్యక్షులకు ఇండియాలో ఉండే భారతీయులు అంటే చిన్నచూపు ఉండవచ్చు గాని.. సుంకాల పేరుతో ఇబ్బందులు పెట్టి ఉండవచ్చు గాని.. భారతీయులంటే ఇప్పటికి అమెరికా దేశస్థులకు విపరీతమైన ప్రేమ. భారతీయుల మీద అమెరికా దేశస్థులకు ఉండే ప్రేమ ఎలాంటిదో ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.

అమెరికా దేశంలో ఓ తెలుగు కుటుంబం చాలా సంవత్సరాలుగా ఉంటున్నది. ఇటీవల ఆ కుటుంబాన్ని చెందినవారు ఇండియాకు వచ్చేశారు. వారి ఇండియాకు బయలుదేరుతుండగా.. ఇన్ని రోజులపాటు వారి పక్కింట్లో ఉన్న అమెరికన్ వృద్ధురాలు వెక్కి వెక్కి ఏడ్చింది. వారిద్దరిని చూసి కన్నీటి పర్యంతమైంది. గట్టిగా హత్తుకొని.. మళ్లీ అమెరికా రండి అంటూ సూచించింది.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది..” భారతీయులు ఎక్కడికి వెళ్లినా సరే వారి ప్రత్యేకతను నిరూపించుకుంటారు. తోటి వాళ్లతో అత్యంత ప్రేమతో ఉంటుంటారు. ఆప్యాయతను ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ వీడియోనే అందుకు నిదర్శనం. ఇప్పటికైనా భారతీయుల పట్ల ఈర్ష్య.. అసూయను ప్రదర్శించే కొంతమంది మూర్ఖపు అమెరికన్లు మారాలని” సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper