Naga Durga: ఈమధ్య కాలం లో కొంతమంది సినీ సెలబ్రిటీల మధ్య ఉన్న రిలేషన్స్ గురించి తెలిసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ షాక్ కి గురవ్వడం కామన్ అయిపోయింది. అసలు ఒక్క సినిమాలో కూడా కలిసి పని చెయ్యని హీరో హీరోయిన్లు కూడా అందరినీ సర్ప్రైజ్ కి గురి చేస్తూ పెళ్లిళ్లు చేసుకోవడం ఈమధ్య కాలంలో చాలానే చూశాము. ఇప్పుడు అలాంటి సర్ప్రైజ్ ని జనాలకు అందించేందుకు మరో యంగ్ జంట సిద్ధం అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ క్రేజీ జంట ఎవరంటే అఖిల్ రాజ్ – నగదుర్గ. రీసెంట్ గా వీళ్ళిద్దరిని ఒకే ఆలయం లో చూసిన నెటిజెన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు నాగ దుర్గ . తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో యూట్యూబ్ లో ఈమె సృష్టించిన సెన్సేషన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. అలా వచ్చిన క్రేజ్ తోనే ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించే రేంజ్ కి ఎదిగింది. రీసెంట్ గానే ఈమె ప్రియదర్శి తో కలిసి ‘ఇడుపు కాగితం’ అనే చిత్రం లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే విధంగా ఒక తమిళ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
అయితే రీసెంట్ గా ఈమె ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో కిరణ్ రాజ్ తో కలిసి సిద్దపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలస్యం లో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించారు. అయితే ఇప్పటి వరకు వీళ్లిద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయినప్పటికీ కలిసి పూజలు చేయిస్తున్నారంటే , రీసెంట్ గా వీళ్ళు కలిసి ఏదైనా ఫోక్ సాంగ్ చేశారా?, లేదా ఏదైనా కొత్త సినిమాలో హీరో హీరోయిన్లు గా నటించడానికి ఒప్పుకున్నారా?, ఇవి రెండు కాకుండా వీళ్ళు ప్రేమలో ఉన్నారా? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే వీళ్లిద్దరు సినీ ఇండస్ట్రీ లోకి రాక ముందే మంచి స్నేహితులేమో ఎవరికీ తెలుసు?, వాళ్ళు కలిసి ఒక గుడి లో దేవుడిని దర్శించుకొని , పూజలు చేయించినంత మాత్రాన ప్రేమికులు అయిపోతారా ?, ఒక అమ్మాయి అబ్బాయి కలిస్తే ఈ కాలం లో కూడా ఇలాగే ఊహించుకోవడం విడ్డూరంగా ఉంది అంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ రీసెంట్ గా జరిగిన వరుస సంఘటనల కారణంగా ఎక్కువ శాతం నెటిజెన్స్ ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు అలా అనుకోవడం లో అర్థం ఉంటుంది కదా అనేది మరికొంతమంది నెటిజెన్స్ వాదన. మరి వీళ్లిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలియాలంటే , కాలమే సమాధానం చెప్పాలి.