Homeజాతీయ వార్తలుAAP MP Sanjay Singh: పార్లమెంట్ లో అమిత్ షా, మోడీని దడదడలాండించిన ఆప్ ఎంపీ.....

AAP MP Sanjay Singh: పార్లమెంట్ లో అమిత్ షా, మోడీని దడదడలాండించిన ఆప్ ఎంపీ.. వైరల్ వీడియో

AAP MP Sanjay Singh: ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతాపార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో విద్యార్థులపై పోలీసులతో హోం మంత్రి అమిషా దాడి చేయించారని పెల్లెట్స్‌తో కాల్పులకు ఆదేశించారని పార్లమెంటులో విపక్షాలు వారం రోజులుగా నిరసన తెలుపుతున్నాయి. సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నాయి. మరోవైపు అమిత్‌షా సభకు రావాలని పట్టుబడుతున్నాయి. ఈ తరుణంలో సోమవారం అమిత్‌షా పార్లమెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రాజ్యసభలో అమిత్‌షా, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎంపీ సంజయ్‌సింగ్‌ మధ్య తీవ్రమైన మాటల […]

AAP MP Sanjay Singh: ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద కాక్రోచ్‌ జనతాపార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో విద్యార్థులపై పోలీసులతో హోం మంత్రి అమిషా దాడి చేయించారని పెల్లెట్స్‌తో కాల్పులకు ఆదేశించారని పార్లమెంటులో విపక్షాలు వారం రోజులుగా నిరసన తెలుపుతున్నాయి. సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నాయి. మరోవైపు అమిత్‌షా సభకు రావాలని పట్టుబడుతున్నాయి. ఈ తరుణంలో సోమవారం అమిత్‌షా పార్లమెంట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రాజ్యసభలో అమిత్‌షా, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎంపీ సంజయ్‌సింగ్‌ మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరిగింది. ఇద్దరూ వెనక్కి తగ్గకుండా ఢీ అంటే ఢీ అన్నట్లుగా వాగ్వాదానికి దిగారు. ఆప్‌ ఎంపీ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు వార్నింగ్‌ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నేనేం మాట్లాడాలో నాకు తెలుసు..
అమిత్‌ షా మాట్లాడుతూ ‘నేను ఏమి మాట్లాడాలో మీరు నాకు చెప్పొద్దు’ అని స్పష్టం చేశారు. ఇది పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతి సభ్యుడికి ఉండాల్సిన స్వేచ్ఛ అని స్పష్టం చేశారు. షా తన ప్రసంగ క్రమాన్ని తానే నిర్ణయించుకుంటానని, ఎవరూ దాన్ని నిర్దేశించాల్సిన అవసరం లేదని సూచించారు.

సంజయ్‌ సింగ్‌ కౌంటర్‌..
దీనికి సమాధానంగా సంజయ్‌ సింగ్‌ మరింత తీవ్రంగా స్పందించారు. ‘అధికారం కోల్పోయాక మీరు బయట కనిపించరు. ఒకవేళ నాకు మూడు గంటల పాటు ఈడీ, సీబీఐ అధికారాలు లభిస్తే మీరందరూ జైల్లో ఉంటారు’ అని అన్నారు. ఈ సందర్భంగా ఈడీ, సీబీఐలను ప్రభుత్వం విపక్షాలపై రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తోందని పరోక్షంగా తెలిపారు. ‘నాకు రెండు–మూడు గంటలు ఈడీ, సీబీఐ ని అప్పగిస్తే మోదీ, అమిత్‌షా వంటి వారిని అరెస్టు చేస్తా’ అని వార్నింగ్‌ ఇచ్చారు. అధికారం మారిన తర్వాత పరిస్థితి తిరగబడుతుందని సూచిస్తూ ఆ వాదనను మళ్లీ లేవనెత్తారు.

రాజకీయ చర్చ..
బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐలను చట్టబద్ధంగా ఉపయోగిస్తోందని, అవినీతి కేసుల్లో చర్యలు తీసుకుంటోందని వాదిస్తుంది. విపక్షాలు ఈ ఏజెన్సీలు రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. సంజయ్‌ సింగ్‌ మాటలు అధికారం మారితే ‘‘రివర్స్‌ ఇంజినీరింగ్‌’’ జరుగుతుందనే హెచ్చరికలా వినిపిస్తున్నాయి. అమిత్‌ షా స్పందన మాత్రం ప్రభుత్వం తన స్థానంలో దృఢంగా ఉందని, విపక్షాలు దాని ప్రసంగాలను నియంత్రించలేవని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఇలాంటి తీవ్ర మాటలు తరచూ వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం తన చర్యలను చట్టబద్ధమైనవిగా చూపించడానికి ప్రయత్నిస్తే, మరోవైపు విపక్షాలు అధికార దుర్వినియోగం అంటూ పదేపదే విమర్శిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper