Agni Pariksha 2: రీసెంట్ గానే గ్రాండ్ గా మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ షూటింగ్ ప్రక్రియ లో ఆడిషన్స్ పర్వం నిన్నటితో ముగిసింది. 70 మందిలో కేవలం 15 మందిని జడ్జీలు చివరి రౌండ్ కి ఎంచుకున్నారు. వీరిలో కేవలం 6 నుండి 8 మంది మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ 15 మంది ఎవరో ఇప్పుడు ఒకసారి లిస్ట్ చూద్దాం. వీరిలో నిజమైన సామాన్యులు ఉన్నారు. అదే విధంగా ఇన్ స్టాగ్రామ్ లో సెలబ్రిటీ స్థాయికి చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరి కంటే ముందుగా చివరి రౌండ్ కి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ రాజా కుమారి దయానా. ఆ తర్వాత మితిలేష్ లిఫ్ట్స్, ఆర్జే చరణ్. ఈ ముగ్గురు నేరుగా జడ్జీల ద్వారా చివరి రౌండ్ కి ఎంపికయ్యారు. మిగిలిన వాళ్ళు టాస్కులు ఆది చివరి రౌండ్ కి చేరుకున్నారు, వాళ్లెవరో ఒకసారి చూద్దాం.
భాగీ తుళ్లూరి, శ్రేష్టి వ్యాకరణం, షాలిని పటేల్, రోహిత్ నాయుడు, మిస్ అపూర్వ, అమన్ మసూద్ , యాంకర్ ప్రియ, గాయత్రీ, హేమంత్ , దీపక్ సేనాపతి, సింగర్ ఝాన్సీ వంటి వారు ఎంపికయ్యారు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో బాగా పాపులారిటీ ని సంపాదించిన ఉప్పల్ బాలు ఆడిషన్స్ సమయం లోనే ఎలిమినేట్ అవ్వగా, ఫుటా తెలుగు ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి , టాస్కులు ఆడడం లో విఫలం అవ్వడం తో ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది. వీళ్లిద్దరు చాలా ఆసక్తికరంగా ఉన్నారు , బిగ్ బాస్ షో కి బాగా పనికొస్తారు , వీళ్ళని తీసుకొని ఉంటే బాగుండేది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి వ్యక్తం అవుతున్నటువంటి అభిప్రాయం. మరి జడ్జీలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని వీళ్ళని ఎలిమినేట్ చేశారో చూడాలి.
ఇదంతా పక్కన పెడితే , పైన చెప్పిన 15 మంది కంటెస్టెంట్స్ లో కొంతమంది నిన్న విడుదల చేసిన ప్రోమోలోనే కనిపించారు. అందులో రాజ కుమారి డయానా నవదీప్ తో జరిపిన సంభాషణ మీరంతా చూసే ఉంటారు. ఆ తర్వాత బాడీ బిల్డర్ మితిలేష్ లిఫ్ట్స్ ని కూడా మీరు ప్రోమో లో చూడొచ్చు. ఇక నాకు ఒకప్పుడు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అంటూ చెప్పిన ఆర్జీ చరణ్ , జడ్జీలను మోసం చేసిన దీపక్ సేనాపతి, వీళ్లంతా ప్రోమో లో కనిపించారు. వీరిలో ఎంతమంది బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారో చూడాలి. గత సీజన్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ లాగానే , ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్స్ మంచి కంటెంట్ ని ఇచ్చేలా ఉన్నారు. ఈ కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఫోటోలు చూడాలంటే , ఈ క్రింది వీడియో ని చూడండి.