Homeఆంధ్రప్రదేశ్‌MBBS Doctor Viral Video: ఈ డాక్టర్ శంకర్ దాదాకు తమ్ముడు.. బిత్తర పోయిన డిఎంహెచ్...

MBBS Doctor Viral Video: ఈ డాక్టర్ శంకర్ దాదాకు తమ్ముడు.. బిత్తర పోయిన డిఎంహెచ్ వో

MBBS Doctor Viral Video: శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా చూశారా.. అందులో తన ప్రేయసి కోసం శంకర్ దాదా అనేక రకాలుగా దొడ్డిదారి ప్రయత్నాలు చేసి డాక్టర్ అవుతాడు. డాక్టర్ విద్య వంట పట్టక అనేక రకాల డ్రామాలు ఆడుతుంటాడు. చివరికి దొరికిపోతాడు. అది సినిమా కాబట్టి లిబర్టీ ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో అలా జరుగుతుందా.. అది సాధ్యమవుతుందా.. అవును అని నిరూపించాడు ఈ వైద్యుడు. ఇంతకీ ఏం జరిగింది.. ఏమైంది.. ఆ […]

MBBS Doctor Viral Video: శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా చూశారా.. అందులో తన ప్రేయసి కోసం శంకర్ దాదా అనేక రకాలుగా దొడ్డిదారి ప్రయత్నాలు చేసి డాక్టర్ అవుతాడు. డాక్టర్ విద్య వంట పట్టక అనేక రకాల డ్రామాలు ఆడుతుంటాడు. చివరికి దొరికిపోతాడు.

అది సినిమా కాబట్టి లిబర్టీ ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో అలా జరుగుతుందా.. అది సాధ్యమవుతుందా.. అవును అని నిరూపించాడు ఈ వైద్యుడు. ఇంతకీ ఏం జరిగింది.. ఏమైంది.. ఆ వైద్యుడు శంకర్ దాదా సినిమాను ఎందుకు రిపీట్ చేయాల్సి వచ్చింది.. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

అది ఉమ్మడి కృష్ణా జిల్లా.. పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.. అక్కడి పీహెచ్ సీ ని జిల్లా వైద్యారోగశాఖ అధికారి దయాకర్ రావు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ లో ఉపయోగించే ఒక మెడికల్ ఇన్స్ట్రుమెంట్ ను చూపించారు. దాని పేరు ఏమిటో చెప్పాలని అక్కడ ఉన్న వైద్యుడిని అడిగారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ను ఏదో వింత వస్తువు మాదిరిగా ఆ వైద్యుడు చూశాడు. దానిని తన ఫోన్లో ఫోటోగా తీసి.. గూగుల్ తల్లిని అడిగాడు. అయినప్పటికీ ఆ పరికరం గురించి తెలియ రాలేదు. ఎంతసేపటికి వైద్యుడు సమాధానం చెప్పకపోవడంతో డిఎంహెచ్వో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుడికే ఆ పరికరం గురించి తెలియనప్పుడు.. ఆ పరికరం ద్వారా రోగులకు వైద్యం ఎలా చేస్తారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈయన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాను చూశారు అనుకుంటా. అందుకే వైద్యుడిగా ఉన్నప్పటికీ.. వైద్య పరికరాల పేర్లు గుర్తులేవు. ప్రభుత్వ నుంచి మాత్రం లక్షలలో వేతనం తీసుకుంటున్నారు. పరికరాల గురించి తెలియనప్పుడు.. పేషెంట్లకు ట్రీట్ మెంట్ ఎలా అందిస్తారు. ఒకవేళ అత్యవసర సమయంలో రోగి వస్తే ఈ వైద్యుడు చేతులు ఎత్తేస్తారు. ఆ సమయంలో అదృష్టం ఉంటే రోగి బతుకుతాడు. లేకుంటే అంతే సంగతులు.. అసలు ఇటువంటివారు వైద్య వృత్తిలోకి ఎందుకు వస్తారు.. రోగుల ప్రాణాలతో ఎందుకు ఆటలాడుతారు.. ఇటువంటివారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేయడమే మంచిదని..నెటిజన్లు పేర్కొంటున్నారు. ఎంబీబీఎస్ పరీక్షలను కాపీ కొట్టి పాస్ అయి ఉంటాడని, లేదా ఎంబీబీఎస్ సీటును డబ్బులతో కొనుక్కుని ఉంటాడని నెటిజన్లు అంటున్నారు. ఇటువంటి వ్యక్తికి డాక్టర్ పోస్ట్ ఇచ్చారంటే సాహసమనే చెప్పాలని నెటిజన్లు ఈసందర్భంగా పేర్కొంటున్నారు. ఆ డాక్టర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper