Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh politics : జగన్ అరెస్ట్‌పై పవన్, అమిత్ షా సీక్రెట్ డీల్.. లైవ్‌లోనే...

Andhra Pradesh politics : జగన్ అరెస్ట్‌పై పవన్, అమిత్ షా సీక్రెట్ డీల్.. లైవ్‌లోనే దొరికేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. మైండ్ బ్లాక్ పొలిటికల్ ట్విస్ట్..

Andhra Pradesh politics : ఏపీ రాజకీయాలు ఎప్పుడు కూడా గుంటూరు మిరపకాయ లాగా ఘాటుగానే ఉంటాయి. రాజకీయ నాయకులు ఏదో ఒక విషయం మీద సమావేశం అవుతూ ఉంటారు.. అందులో కాస్త రకరకాల చర్చలు జరుగుతుంటాయి. ఆ తర్వాత వేరే విధంగా బయటికి వస్తుంటాయి. అవి బయటకు వచ్చిన తర్వాత విశ్లేషకులు తమ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అక్కడ జరిగింది మొత్తం తాము చూసినట్టు.. తమ సమక్షంలోనే చెబుతుంటారు. ఫలితంగా అసలు వాస్తవం పక్కకు వెళ్తుంది. చివరికి ఊహాగానం ప్రచారంలో ఉంటుంది.

ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. నాదెండ్ల మనోహర్ మంత్రిగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ రాజకీయ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. అక్కడ ఏం జరిగింది అనేది వీరి ముగ్గురికి తెలిసి ఉంటుంది. కొన్ని అంతర్గత విషయాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అంత పెద్ద విషయాలను ఏ నాయకుడు కూడా బయటకు చెప్పడానికి ఇష్టపడడు. కొన్ని విషయాలు మాత్రమే విలేకరులతో చెబుతారు.. ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఒకవేళ విలేకరులకు బలమైన పబ్లిక్ రిలేషన్ ఉంటే లోపల ఏం జరిగిందో తెలుసుకుంటారు. ఆ తర్వాత దానిని వార్తగా ప్రచురిస్తారు. జనంలోకి తీసుకెళ్తారు. కానీ కొంతమంది విశ్లేషకులు తమకు నచ్చింది చెబుతుంటారు. తమకు తోచింది వాగుతుంటారు. ఇప్పుడు ఏపీలో అమిత్ షా, నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ భేటీపై కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇలానే మాట్లాడారు.

పవన్ కళ్యాణ్, మనోహర్, అమిత్ షా భేటీలో జగన్ అరెస్ట్ గురించి చర్చ వచ్చిందని.. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ కోరినట్టు.. దానికి అమిత్ షా నో చెప్పినట్టు.. జగన్మోహన్ రెడ్డిని లాంగ్ టర్మ్ పొలిటికల్ ఫ్రెండ్ అని అమిత్ షా చెప్పినట్టు.. దానికి పవన్ కళ్యాణ్ కూడా తల ఊపినట్టు.. ఇలా చెప్పుకుంటూ పోయారు ప్రొఫెసర్ నాగేశ్వర్. వాస్తవానికి ఇలాంటి విషయాలు రాజకీయ యవనిక మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడితే వాటి ఎఫెక్ట్ అధికంగా ఉంటుంది. వీటిని అంచనా వేయలేక నాగేశ్వర్ ఏదో ఒకటి మాట్లాడేసారు. ఇప్పుడు అది ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. నాగేశ్వర్ మాట్లాడిన మాటలను వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుంది. రకరకాల ప్రచారాలు చేయడం మొదలుపెట్టింది.

నాగేశ్వర్ వ్యాఖ్యల తర్వాత ఏపీ మంత్రి మనోహర్ స్పందించారు. ఆయన అలా మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అసలు అక్కడ జరిగింది ఒకటని.. నాగేశ్వర్ చెప్పింది ఒకటని.. జగన్ అరెస్ట్ గురించి అక్కడ ప్రస్తావన రాలేదని మనోహర్ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ వైసీపీ సోషల్ మీడియా.. మీడియా రకరకాల ప్రచారాలు చేస్తున్నాయి. అందువల్లే విశ్లేషకులు ఒక పార్టీకి వత్తాసు పలకకూడదు. తమకు తోచినట్టు మాట్లాడకూడదు. నిజం తెలిస్తే బయటపెట్టాలి. లేకుంటే నిశ్శబ్దంగా ఉండాలి. అటు ఇటు కాని విధంగా మాట్లాడితే చివరికి ఆ ప్రభావం రాష్ట్ర ప్రయోజనాల మీద.. ప్రజల మీద ఉంటుంది. ఈ విషయం ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తులకు తెలియకపోవడం నిజంగా బాధాకరం.

ఈ మధ్య వయసు పెరిగే కొద్దీ ప్రొఫెసర్ నాగేశ్వర్ లో అప్పట్లో ఆయన భావజాలం అంతా మళ్లీ బయటకొస్తోంది. కమ్యూనిజం భావజాలం.. కాంగ్రెస్ సెక్యూలరిజం కలగలిపి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడమే పనిగా పెట్టుకొన్నారని ఈ మధ్యన కొందరు కౌంటర్లు కూడా ఇస్తున్నారు. అయినా కూడా ఈ మేధావి నాగేశ్వర్ తన పంథా అసలు మార్చుకోవడం లేదు. బీజేపీపై నరనరాన వ్యతిరేకతతో అటు మోడీపై ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు. ఇటు బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీలను ఆడిపోసుకుంటున్నాడు. నిజానికి అమిత్ షాతో భేటిలో పవన్, నాదెండ్ల తప్ప ఎవరూ లేరు. అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ కెమెరా కానీ.. వాయిస్ మైక్ కాని పెట్టలేదు. కానీ అక్కడ ఉన్నట్టు.. తనకు చెవిలో చెప్పినట్టుగా అన్నీ కల్పిత కథనాలతో నాగేశ్వర్ తెలుగు ప్రజల మెదళ్లలోకి విషం చిమ్ముతున్నారు. పెద్దాయన.. పెద్దమనిషి.. పైగా మేధావి ముసుగు అని నాదేండ్ల మనోహర్ గట్టిగా మాట్లాడలేదు కానీ.. ఇలానే ఆడిపోసుకుంటే నాగేశ్వర్ పెద్దరికానికి ఎప్పుడో ఒకప్పుడు ఎసరు రావడం ఖాయం.. అయినా నోరుమంచిదైతే ఊరు మంచిది అవుతుందని అంటారు. ఆ విషయం గ్రహించి తెచ్చుకున్న పెద్దరికం తగ్గట్టు ప్రొఫెసర్ గారు మారితే బెటర్ అని పలువురు సూచిస్తున్నారు. వింటే ఆయనపై విమర్శల వాడి తగ్గుతుంది.. వినకుంటే బయట ఈగల మోత పెరుగుతుంది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper