Homeక్రీడలుక్రికెట్‌Mohammad Amir India comments : ఓరేయ్ అమీరూ.. తల ఎక్కడ పెట్టుకుంటావ్.. వీడి తిట్లే...

Mohammad Amir India comments : ఓరేయ్ అమీరూ.. తల ఎక్కడ పెట్టుకుంటావ్.. వీడి తిట్లే టీమిండియా కు దీవెనలు

Mohammad Amir India comments : నరం లేని నాలుక 40 విధాలుగా మాట్లాడుతుందట. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ నాలుక కూడా అలాంటిదే. టీమిండియా అంటే చాలు మహమ్మద్ అమీర్ కు ఎక్కడా లేని కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంతేకాదు పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు టీమిండియాకు శాపనార్ధాలు పెడతాడు. కాకపోతే అవి వాస్తవరూపం దాల్చవు. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో జోకర్ ఎవరయ్యా అంటే మహమ్మద్ అమీర్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే […]

Mohammad Amir India comments : నరం లేని నాలుక 40 విధాలుగా మాట్లాడుతుందట. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ నాలుక కూడా అలాంటిదే. టీమిండియా అంటే చాలు మహమ్మద్ అమీర్ కు ఎక్కడా లేని కోపం వచ్చేస్తూ ఉంటుంది. అంతేకాదు పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు టీమిండియాకు శాపనార్ధాలు పెడతాడు. కాకపోతే అవి వాస్తవరూపం దాల్చవు.

ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో జోకర్ ఎవరయ్యా అంటే మహమ్మద్ అమీర్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోతుందని చెప్పాడు.. కానీ ఫలితం వేరే విధంగా వచ్చింది. ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమిపాలైంది. సూపర్ 8 లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిడియా ఓడిపోయిన తర్వాత.. జింబాబ్వే తో జరిగే మ్యాచ్లో కూడా ఇదే ఫలితం వస్తుందని అమీర్ జోస్యం చెప్పాడు. అయితే జింబాబ్వే పై టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది.

ఇక వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో టీమ్ ఇండియా ఓడిపోతుందని అమీర్ ముందుగానే బల్లి మాదిరిగా శకునం చెప్పాడు. అయితే ఆ మ్యాచ్లో టీమ్ ఇండియా విజయం సాధించింది. సంజు శాంసన్ అదరగొట్టాడు. అయితే టీమిండియా ఓడిపోతుందని చెప్పావు కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తే.. సంజు ఆడాడు కాబట్టి టీమిండియా గెలిచిందని వితండవాదం చేశాడు. ఇప్పుడిక సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోతుందని ముందుగానే హెచ్చరించాడు. టీమిండియా బ్యాటర్లు గొప్పగా ఆడటం లేదని.. కేవలం ఒకరిద్దరు మాత్రమే ఆడుతున్నారని అమీర్ పేర్కొన్నాడు. బుమ్రా మాత్రమే బౌలింగ్లో అదరగొడుతున్నాడని.. మిగతా వారంతా విఫలమవుతున్నారని అమీర్ పేర్కొన్నాడు. అయితే మూడుసార్లు టీమ్ ఇండియా గురించి ప్రతికూలంగా మాట్లాడిన అమీర్.. అన్నిసార్లు విమర్శల పాలయ్యాడు. మహమ్మద్ అమీర్ ప్రతి సందర్భంలో టీమిండియా పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో.. అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నువ్వు ఇలాగే పిల్లి శాపనార్ధాలు పెడుతూనే ఉండు.. టీమిండియా గెలుస్తూనే ఉంటుందని చెబుతున్నారు.

మహమ్మద్ అమీర్ తీరును ఇటీవల టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర స్థాయిలో ఎండగట్టాడు. “గతంలో నువ్వు ఎలా బౌలింగ్ చేశావు? 2024 t20 వరల్డ్ కప్ మర్చిపోయావా? అమెరికా జట్టును కూడా ఓడించలేక చేతులెత్తేసావు కదా.. దారుణంగా బౌలింగ్ వేసావు కదా.. అటువంటి నువ్వు టీమ్ ఇండియాను విమర్శిస్తావా.. ఒకసారి గతం గుర్తు తెచ్చుకో.. అప్పుడు నీకు వాస్తవం అర్థమవుతుందని” కైఫ్ వ్యాఖ్యానించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper