Axar Patel: న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్ భవితవ్యాన్ని తేల్చే వన్డే మ్యాచ్ అది. రోహిత్ శర్మ ఏడు పరుగులు మాత్రమే చేసి ఫిషర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. గైక్వాడ్ 18 పరుగుల వద్ద డఫీ బౌలింగ్లో వెనక్కి వెళ్లిపోయాడు. విరాట్ కోహ్లీ 5 పరుగులకే ఫిషర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఒక దశలో భారత్ 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఇటీవలి వన్డే లాగానే టీమిండియా పరిస్థితి అవుతుందా అని అందరూ అనుకున్నారు.. న్యూజిలాండ్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు.
ఈ దశలో మైదానంలోకి వచ్చాడు అక్షర్ పటేల్. కెప్టెన్ అయ్యర్ తో స్థిరంగా బ్యాటింగ్ చేశాడు. చెత్త బంతులను బౌండరీ అవతలికి పంపించాడు. కష్టమైన బంతులకు రెస్పెక్ట్ ఇచ్చాడు. మొత్తంగా 55 బంతుల్లో ఐదు ఫోర్లు.. ఒక సిక్సర్ తో 46 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీకి చేరువ అవుతున్న క్రమంలో బ్రేస్ వెల్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు.. కెప్టెన్ అయ్యర్ తో కలిసి నాలుగో వికెట్ కు 52 పరుగులు.. ఇషాన్ కిషన్ తో కలిసి ఐదో వికెట్ కు 35 పరుగులు జోడించాడు. కష్టాల్లో ఉన్న జట్టుకు మరోసారి ఆపద్బాంధవుడిగా నిలిచాడు.
ఐదవ వన్డేలో మరోసారి టీమిండియా బ్యాటింగ్ కష్టాలను ఎదుర్కొన్న నేపథ్యంలో.. అక్షర్ బలంగా నిలబడ్డాడు. టాప్ ఆర్డర్ విఫలమైన చోట బాధ్యతాయుతంగా అక్షర్ ఆడాడు. 46 పరుగులు చేసినప్పటికీ.. అతడు ఆడిన ఆట అందరిని ఆకట్టుకుంది. అక్షర్ పటేల్ కేవలం ఆల్ రౌండర్ మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో బ్యాట్ తో జట్టుకు అండగా నిలబడగలుగుతాడు. గతంలో ఎన్నో సందర్భాలలో ఈ విషయాన్ని నిరూపించాడు. ముఖ్యంగా ప్రపంచకప్ ఫైనల్లో అతడు ఆడిన ఇన్నింగ్స్ భారత క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది.
2024 t20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా తో భారత్ పోటీ పడింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు 34 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ.. రిషబ్ పంత్.. సూర్య కుమార్ యాదవ్ ఓడిపోవడంతో జట్టు తీవ్రమైన ఒత్తిడిలో పడింది. ఈ దశలో అక్షర్ ఐదవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. విరాట్ కోహ్లీతో కలిసి అతడు అద్భుతంగా ఆడాడు. కేవలం 31 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సర్లు.. ఒక ఫోర్ ఉన్నాయి. కోహ్లీతో కలిసి 72 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అతడు నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం భారత జట్టు భారీ స్కోర్ చేసేందుకు పునాది వేసింది. చివరికి భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి టి20 ప్రపంచ కప్ అందుకుంది..
అక్షర్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించిన మరో ఇన్నింగ్స్ 2022 వెస్టిండీస్ జట్టుతో జరిగిన రెండవ వన్డేలో కనిపించింది. వెస్టిండీస్ 311 పరుగుల భారీ టార్గెట్ భారత జట్టు ముందు ఉంచింది. టార్గెట్ ఫినిష్ చేయడంలో భారత జట్టు ఇబ్బంది పడింది. చివరి 10 ఓవర్లలో 100 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. అప్పటికే కీలకమైన బాటలు వెనక్కి వెళ్లిపోయారు. ఈ దశలో అక్షర్ అద్భుతంగా ఆడాడు. కేవలం 35 మందిలోనే 64 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఐదు సిక్సర్లు.. మూడు ఫోర్లతో వెస్టిండీస్ జట్టు మీద తన ప్రతాపాన్ని చూపించాడు. చివరి ఓవర్లో విజయానికి ఆరు పరుగులు అవసరమైనప్పుడు.. కైల్ మేయర్స్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టి భారత జట్టుకు విజయం అందించాడు. ఈ విజయంతో భారత జట్టు సిరీస్ సొంతం చేసుకుంది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో అక్షర్ అదరగొట్టాడు. న్యూజిలాండ్ విధించిన 2 5 2 పరుగుల లక్ష్యాన్ని చేదించడానికి భారత జట్టు కీలకమైన వికెట్లను నష్టపోయింది. రోహిత్.. విరాట్ అవుట్ కావడంతో అయ్యర్ తో కలిసి అక్షర భారత జట్టు ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. 40 పంతుల్లో 29 పరుగులు చేశాడు. అయ్యర్ తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఆ తర్వాత భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది.
అక్షర పటేల్ ఆడే తీరును చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడతాడు. అవసరమైనప్పుడు వేగంగా పరుగులు తీస్తాడు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడం అతడి సత్తాకు నిదర్శనం. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఐదవ వన్డేలో చేసిన 46 పరుగులు కూడా ఇందులోకి వస్తాయి. పెద్ద బ్యాటర్లు విఫలమైనప్పుడు జట్టుకు అండగా నిలిచేవాడే నిజమైన ఆల్ రౌండర్. అక్షర్ మరోసారి ఇదే విషయాన్ని గుర్తు చేశాడు.
Axar Patel is playing those cover drives just like Kumar Sangakkara.
– Just look at the reaction of Roko. https://t.co/khvh21uzqh
— lndian Sports Network (@IS_Netwrk29) November 15, 2026