Homeజాతీయ వార్తలుTVK Vijay: టీవీకే విజయ్ లో భయం మొదలైంది..ఇక కష్టమే..

TVK Vijay: టీవీకే విజయ్ లో భయం మొదలైంది..ఇక కష్టమే..

TVK Vijay: ఏ రాజకీయ నాయకుడికైనా సరే సోషల్ మీడియాలో కొద్దిరోజుల వరకే బలం ఉంటుంది. దీర్ఘకాలం దానిని కొనసాగించలేడు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. మొన్నటిదాకా తమిళనాడు రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా విజయ్ కొనసాగే వారు. మీడియాలో.. సోషల్ మీడియాలో ఆయన గురించే విపరీతంగా చర్చ నడిచేది. ఇప్పుడు పరిస్థితి ఒకసారి గా మారిపోయింది. ఇటీవల కరూర్ ప్రాంతంలో 31 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు విజయ్ […]

TVK Vijay: ఏ రాజకీయ నాయకుడికైనా సరే సోషల్ మీడియాలో కొద్దిరోజుల వరకే బలం ఉంటుంది. దీర్ఘకాలం దానిని కొనసాగించలేడు. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. మొన్నటిదాకా తమిళనాడు రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా విజయ్ కొనసాగే వారు. మీడియాలో.. సోషల్ మీడియాలో ఆయన గురించే విపరీతంగా చర్చ నడిచేది. ఇప్పుడు పరిస్థితి ఒకసారి గా మారిపోయింది.

ఇటీవల కరూర్ ప్రాంతంలో 31 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు విజయ్ . అయితే అది చెల్లదని తమిళనాడు హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో విజయ్ కి తొలిసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇక అక్కడి ప్రతిపక్షాలు తమ పాలిటిక్స్ మొదలుపెట్టాయి. విజయ్ కి సినిమా చూపించడం ప్రారంభించాయి. దీంతో టీవీకే డిఫెన్స్ లో పడిపోయింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.

త్వరలో తమిళనాడు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది . ఈ ఎన్నికలకు విజయ్ అంత సుముఖంగా లేరు. ఎందుకు అంటే క్షేత్రస్థాయిలో ఆయనకు అనుకూలంగా పరిస్థితి కనిపించడం లేదు. అందువల్లే వచ్చే ఏడాదిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని విజయ్ భావిస్తున్నారు. మరోవైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ను డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నియమించారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా ఒక మహిళ అధికారి కొనసాగుతున్నారు. ఆమెను విధులనుంచి తప్పించాలని.. ఆమె స్థానంలో కొత్త అధికారికి అవకాశం ఇవ్వాలని విజయ్ భావిస్తున్నారు. అయితే ఆ మహిళ అధికారి రాజీనామా చేసే అవకాశం లేదు. అందువల్లే విజయ్ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తారని ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో.. పార్లమెంటు ఎన్నికల్లో సినీ గ్లామర్ ద్వారా ఓట్లు సాధించడం పెద్ద కష్టం కాదు. స్థానిక ఎన్నికలు మాత్రం ఇలా ఉండవు. గ్రామాలలో పటిష్టమైన కార్యవర్గం అవసరం ఉంటుంది. బలమైన నాయకులు ఉండాలి. అయితే విజయ్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం లేదు. గొప్ప గొప్ప నాయకులు కూడా లేరు. అందువల్లే స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదని విజయ్ భావిస్తున్నారు.

తమిళనాడులో జరిగే స్థానిక ఎన్నికలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ కులాలు.. ఇతర సమీకరణాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు కూడా పోటీలో ఉంటారు. అలాంటప్పుడు డీఎంకే.. అన్నా డీఎంకే నుంచి టి వి కే గట్టి పోటీ ఎదుర్కోవడం ఖాయం. అలాంటప్పుడు పార్టీ అనుబంధ విభాగాలను.. ఇతర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం టీవీకే మీద ఉంది. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలకు వెళ్తే ఇబ్బందులు తప్పవని విజయ్ భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం తర్వాత ఎన్నికలకు వెళ్తామని విజయ్ చెబుతున్నారు. అందువల్లే వచ్చే ఏడాది స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని టీవీకే నేతలు చెబుతున్నారు.

స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం పట్ల డిఎంకె మండిపడుతోంది. ఎన్నికలలో ఓటమి భయంతోనే టీవీ కే విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తోంది. ఒకవేళ వచ్చే ఏడాది స్థానిక ఎన్నికలు జరిగితే అది విజయ్ కి బలంగా మారుతుందా.. లేదా ప్రతిపక్షాలకు జవసత్వాన్ని ఇస్తుందా.. చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper