Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan Mohan Reddy: జగన్ ఎంట్రీ ఇచ్చాడు.. విజయ్ గ్రాఫ్ నేల చూపులు.. తమిళనాడులో...

YS Jagan Mohan Reddy: జగన్ ఎంట్రీ ఇచ్చాడు.. విజయ్ గ్రాఫ్ నేల చూపులు.. తమిళనాడులో ఏం జరుగుతోంది..

YS Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డి తమిళ గడ్డ మీద అడుగు పెట్టాడు. విజయ్ తో చేతులు కలిపాడు. సరదాగా భుజం తట్టి అభినందించాడు. ఫోటోలకు నవ్వుతూ ఫోజులు ఇచ్చాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.. తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం నేల చూపులు చూడటం మొదలైంది. తమిళనాడులో విజయ్ సమర్థవంతంగా పరిపాలన సాగిస్తున్నారు. వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి చిక్కులు వచ్చి పడ్డాయి. […]

YS Jagan Mohan Reddy: జగన్మోహన్ రెడ్డి తమిళ గడ్డ మీద అడుగు పెట్టాడు. విజయ్ తో చేతులు కలిపాడు. సరదాగా భుజం తట్టి అభినందించాడు. ఫోటోలకు నవ్వుతూ ఫోజులు ఇచ్చాడు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.. తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభుత్వం నేల చూపులు చూడటం మొదలైంది.

తమిళనాడులో విజయ్ సమర్థవంతంగా పరిపాలన సాగిస్తున్నారు. వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి చిక్కులు వచ్చి పడ్డాయి. విజయ్ కోయంబత్తూరులో ఇటీవల పెరియార్ అరి ఉలగం లైబ్రరీని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో ఏర్పాటుచేసిన పుస్తకాల కొనుగోలు సంబంధించి అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. అందువల్లే తమిళనాడులో రచ్చ జరుగుతుంది. అయితే ఈ వ్యవహారం వెనుక రాజకీయ వర్గాలలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. అందులో ప్రధానమైనది ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో.. సీఎం విజయ్ ఇటీవల సమావేశం..

ఇటీవల వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహానికి జగన్.. తమిళనాడు సీఎం విజయ్ ని ప్రత్యక్షంగా కలుసుకున్నారు. ఇద్దరు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ నేపద్యంలో విజయ్ డ్రీం ప్రాజెక్టు పెరియర్ అరి ఉలగం చిక్కుల్లో పడింది. దీంతో జగన్ పలకరించిన సమయం.. సందర్భం ఏమోగానీ విజయ్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

తమిళనాడులో ఏడు ఎకరాల విస్తీర్ణంలో.. 300 కోట్ల బడ్జెట్ తో గ్రంథాలయ నిర్మించారు. 1800 పుస్తకాలు ఏ ఐ ద్వారా రాసినవని.. రచయితలు లేని పేర్లతో పుస్తకాలను సృష్టించారని ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్ ఆరోపించారు. 250 విలువైన పుస్తకాలపై ఏకంగా 1500 ధర ఉన్నట్టుగా ముద్రించారని.. అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు.. ఇక బిజెపి మాజీ నాయకుడు అన్నామలై ఈ వ్యవహారంపై ఇండిపెండెంట్ దర్యాప్తుకు డిమాండ్ చేశారు. దీనిపై డిఎంకె.. టీవీకే మధ్య ఆరోపణలు నడుస్తున్నాయి. పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయిన నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యవహారాన్ని ఏపీ రాజకీయాలకు అనుసంధానిస్తూ కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో రివర్స్ టెండర్ల వ్యవహారం జరిగింది. విజయ్ తో జగన్ మాట్లాడగానే తమిళనాడులో ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. జగన్ ఎక్కడ అడుగుపెట్టినా సరే.. ఎవరికి షేక్ హ్యాండ్ ఇచ్చిన సరే.. మొత్తం సీన్ రివర్స్ అవుతుందంటూ చాలామంది సోషల్ మీడియాలో మీమ్స్ సృష్టిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper