Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ 2004లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఎవరు అవుతారు అనే ప్రశ్న వ్యక్తమైంది… దీనికి చాలామంది సోనియాగాంధీ అని మొహమాటం లేకుండా చెప్పేశారు. జాతీయ మీడియాలో సైతం దేశానికి కాబోయే ప్రధానమంత్రి సోనియా గాంధీ అని కథనాలు ప్రసారమయ్యాయి. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి పనిచేయడం సరికాదని బీజేపీ నాయకులు విమర్శించడం మొదలుపెట్టారు. సుబ్రహ్మణ్యస్వామి లాంటివారైతే తెరమీదకి వచ్చి ఒక ఉద్యమమే చేశారు.. సుష్మా స్వరాజ్.. ఎల్కే అద్వానీ లాంటి నాయకులు సోనియా గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం ఏ మాత్రం సబబు కాదని పేర్కొన్నారు.
సోనియాగాంధీ ప్రధానమంత్రిగా నాడు మన్మోహన్ సింగ్ ను ప్రతిపాదించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఆమెదే పెత్తనం కాబట్టి.. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాగలిగారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ కంటే ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. కానీ సోనియాగాంధీ మాట వినే వ్యక్తి మాత్రమే ప్రధానమంత్రి కావాలి కాబట్టి.. మన్మోహన్ సింగ్ ను ఆమె ఎంచుకున్నారు. యూపీఏ చైర్ పర్సన్ గా ఆమె కొనసాగారు. నాటి రోజుల్లో మన్మోహన్ సింగ్ కేవలం సోనియాగాంధీ మాట వినడానికి మాత్రమే పరిమితమైన వ్యక్తిగా మిగిలిపోయారు.
సోనియాగాంధీ తాజాగా తన ఆటోబయోగ్రఫీలో తాను ప్రధానమంత్రి పదవిని స్వీకరించక పోవడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీ అని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవం మాత్రం వేరే విధంగా ఉంది. బిజెపి నాయకులు గత చరిత్రను తవ్వి ముందు పెడుతున్నారు. అందులో ప్రధానంగా వినిపిస్తున్న అంశం.. సోనియా గాంధీ విదేశీయత. విదేశాలలో జన్మించిన సోనియా గాంధీ భారత ప్రధానమంత్రి కావడంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత మొదలైంది. ఆమె ప్రధానమంత్రి కావడాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకించింది. సుబ్రహ్మణ్య స్వామి వంటి వారు సోనియాగాంధీకి వ్యతిరేకంగా తమ స్వరం వినిపించారు. బిజెపి.. సుబ్రహ్మణ్యస్వామి మాత్రమే కాకుండా.. నాటి రోజుల్లో సోనియా గాంధీ ప్రధానమంత్రి కాకుండా చెదరగొట్టిన వారిలో జయలలిత కూడా ఒక రు..
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియా గాంధీ ప్రధానమంత్రి అవుతారని చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఒక విలేకరుల సమావేశంలో సోనియా అసలు పేరు ఎడ్విగే ఆంటోనియో అల్బినా మైనో అని ప్రస్తావించారు. ఆమె ప్రధానమంత్రి కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. జయలలిత అసలు పేరు కోమలవల్లి అని ప్రస్తావించారు. వాస్తవానికి జయలలిత మినహా ఎవరు కూడా ఇంతవరకు సోనియా అసలు పేరును ప్రస్తావించలేదు. ఆ స్థాయిలో విమర్శించలేదు. నాడు జయలలిత చేసిన విమర్శలను ప్రధానంగా ప్రస్తావిస్తూ తమిళ్ పత్రికలు మొదటి పేజీలో ఎడ్విగే ఆంటోనియా అల్బినా మైనో అడ్డు పెద్ద అక్షరాలతో ప్రచురించాయి. జయలలిత చేసిన ఈ విమర్శలవల్ల చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ.. ఏడీఎంకే రాజకీయంగా పొత్తు పెట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత డిఎంకె కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ.. డీఎంకే కూటమి కలిసి జయలలిత ప్రభుత్వాన్ని ఈ స్థాయిలో ఇబ్బంది పెట్టాయో అందరికీ తెలుసు.. సోనియాగాంధీ ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవడంలో జయలలిత ముఖ్యమైన పాత్ర పోషించారు.. ఆటోబయోగ్రఫీలో సోనియాగాంధీ పేర్కొన్నట్టు ఆమె ప్రధానమంత్రి కాకపోవడానికి రాహుల్ గాంధీ.. ప్రియాంక గాంధీ కారణం కాదని బిజెపి నేతలు చెబుతున్నారు.