Sonia Gandhi Autobiography: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు.. ఒకప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తన ఆత్మకథను బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పేరుతో రచించిన విషయం తెలిసిందే. ఈ పుస్తకంలో తన జీవితం.. రాహుల్ గాంధీని వివాహం చేసుకోవడం.. ఇండియాకు రావడం.. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురైన పరిణామాలు.. ఇతర అనుభవాలను సోనియాగాంధీ పుస్తకం రూపంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ పుస్తకానికి సంబంధించి ఇప్పుడు వివాదం నెలకొంది. సోనియాగాంధీ రాసిన బిలాంగింగ్ జర్నీ ఆఫ్ లవ్ లో వివాహస్పదమైన అంశాలు ఉన్నాయని.. బిజెపి నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే బిలాంగింగ్ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకాన్ని ఇండియాలో ప్రచురిస్తున్న పెంగ్విన్ రాండమ్ హౌస్ ఆఫ్ ఇండియా.. ఆ ప్రక్రియను నిలిపివేసినట్టు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బిజెపి నేతల ఒత్తిడి వల్లే పెంగ్విన్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోనియాగాంధీ ఆత్మకథ అంటే బిజెపి నేతలు ఎందుకు బయపడుతున్నారని.. సోనియా గాంధీ తన జీవితంలో జరిగిన సంఘటనలను దేశ ప్రజల ముందు ఉంచడానికి ఒక పుస్తకం రూపంలో తీసుకొని వస్తుంటే.. బిజెపి నేతలు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఈ వివాదం కొద్దిరోజులుగా దేశ రాజకీయాలలో కలకలం సృష్టిస్తోంది. ఈ పుస్తకంలో సోనియాగాంధీ తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇటలీలో ఆమె జననం.. ఆ తర్వాత రాహుల్ గాంధీతో ఏర్పడిన పరిచయం.. అది ప్రేమగా మారడం.. ఆయనను వివాహం చేసుకోవడం.. ఇండియాకు రావడం.. రాహుల్ గాంధీ మరణం తర్వాత ఆమె జీవితంలో చోటుచేసుకున్న మార్పులు.. రాజకీయ ప్రయాణం.. ప్రధానమంత్రి పదవి దక్కకుండా పోవడం.. నాడు సుష్మా స్వరాజ్ చేపట్టిన ఆందోళనలు.. సోనియాగాంధీ ప్రధానమంత్రి పదవిని వదులుకున్న తీరు.. కేవలం యూపీఏ చైర్ పర్సన్ గా మాత్రమే మిగిలిన తీరు.. బిజెపి ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు.. కేంద్ర దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసులు.. వీటన్నింటిని సోనియాగాంధీ తన ఆత్మ కథ లో ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా సోనియాగాంధీకి ప్రధానమంత్రి పదవి దూరంగా వెనక బిజెపి కుట్ర ఉందని ఆ పుస్తకంలో రాసినట్టు విశ్లేషకులు అంటున్నారు.
ఈ అంశాలు తమకు వ్యతిరేకంగా ఉంటాయని బిజెపి నేతలు భావిస్తున్నట్టు నేషనల్ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. అందుపల్లే బీజేపీ నేతలు పెంగ్విన్ కంపెనీ మీద ఒత్తిడి తీసుకురావడంతో మనదేశంలో ప్రచురణ నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక గహ్లాట్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు..”సోనియాగాంధీ రాసిన ఆత్మకథలు మార్పులు కావాలని పెంగ్విన్ కంపెనీ కోరడమేంటి.. అందువల్లే ప్రచురణ నిలిపివేసిందా.. దీని వెనక బిజెపి నాయకులకు ఉన్నారు. వారు రాజకీయంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు.. ఆత్మకథని కూడా తట్టుకోలేని స్థితిలో బిజెపి నాయకులు ఉన్నారని” అశోక్ వ్యాక్యానించారు. మరోవైపు సోనియాగాంధీ ఆత్మ కథను నిలిపివేయడం బిజెపి చవకబారు రాజకీయాలకు అదృష్టమని ఆరోపించారు. మరోవైపు ఈ వివాదంపై పెంగ్విన్ కంపెనీ స్పందించింది. ఒక పుస్తకాన్ని ప్రచురించే క్రమంలో అన్ని అంశాలను పరిశీలిస్తామని.. ఇందులో వివాదాలకు ఆస్కారం లేదని క్లారిటీ ఇచ్చింది.