Harish Rao Chandrababu Naidu : చంద్రబాబు అంటే గులాబీ పార్టీ నేతలకు అసలు పడదు. చంద్రబాబును ఒక బూచి లాగా చూపిస్తూ ఉంటారు. చంద్రబాబు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటే.. తెలంగాణ ప్రయోజనాలకు అడ్డం తగులుతున్నాడని సొంత మీడియాలో.. సొంత సోషల్ మీడియా గ్రూపులలో తెగ ప్రచారం చేస్తుంటారు. ఎందుకంటే చంద్రబాబు ప్రస్తావనం లేకుండా గులాబీ పార్టీ నాయకులు మాట్లాడలేరు. చంద్రబాబు మీద విమర్శలు చేయకుండా వాళ్లు రాజకీయాలు చేయలేరు.
ఇప్పుడు ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ కాంగ్రెస్ లోకి రావడానికి అంటే ముందు టిడిపిలో ఉన్నారు. కొడంగల్ ఎమ్మెల్యేగా కొనసాగారు. చంద్రబాబుకు నమ్మదగిన శిష్యుడిగా రేవంత్ ఉన్నారు. తెలంగాణలో టిడిపికి ప్రాధాన్యం తగ్గిపోయిన నేపథ్యంలో రేవంత్ కాంగ్రెస్లో చేరిపోయారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా.. తెలంగాణ ముఖ్యమంత్రిగా తన ప్రస్తానాన్ని పెంచుకున్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. అందులో ప్రధానమైనది పింఛన్ పెంపుదల. పింఛన్ ను ఏకంగా 6000 చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాని దానిని ఇంతవరకు అమలు చేయలేకపోయారు. అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత కొత్త పింఛన్లను అమలు చేస్తున్నారు.
సరిగా ఇదే విషయాన్ని హరీష్ రావు ప్రస్తావించారు. ఒక సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు పింఛన్లను 6వేలకు పెంచారు. ప్రతి నెల ఆయన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇచ్చి వస్తున్నారు. కాని తెలంగాణలో మాత్రం అది అమలు సాధ్యం కావడం లేదు. ఎన్నికల ముందు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఇంతవరకు దానిని అమలు చేయలేకపోయారు. మాట్లాడితే చంద్రబాబును గురువు అని రేవంత్ రెడ్డి సంబోధిస్తూ ఉంటారు. ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు అక్కడి ప్రజలకు 6000 చొప్పున పింఛన్ ఇస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి అమలు చేయలేకపోతున్నారు. అమలు చేయని పక్షంలో ఎన్నికల ముందు ఎందుకు హామీ ఇచ్చినట్టు.. ప్రజలను ఎందుకు మోసం చేసినట్టు అని హరీష్ రావు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.
సాధారణంగా చంద్రబాబు ప్రస్తావన వస్తే చాలు హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తారు. రెండు కండ్ల బాబు అంటూ మాట్లాడుతారు. కానీ పింఛన్ల విషయంలో మాత్రం చంద్రబాబును హరీష్ రావు పొగిడారు. ఆయన తీసుకున్న నిర్ణయం గొప్పదని వ్యాఖ్యానించారు. మరి ఈ వార్తను సాక్షి ప్రచురిస్తుందా.. నమస్తే తెలంగాణ పబ్లిష్ చేస్తుందా.. గులాబీ పార్టీ అనుకూల మీడియాలు.. మీడియా గ్రూపులు హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇస్తాయా.. కష్టమే. చంద్రబాబు అంటే గులాబీ పార్టీ నేతలకే కాదు.. ఆ పార్టీ అనుకూల.. అనుబంధ మీడియా సంస్థలకు కూడా చాలా ఇబ్బందే.. ఎందుకంటే గడిచిన చాలా సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం కదా..
Chandrababu గురువు అంటావు… మరి ఆయన పథకాలను ఎందుకు Follow అవ్వవు?
Chandrababu ₹6,000 ఇస్తున్నారు… నువ్వెప్పుడు ఇస్తావు Revanth Reddy?
–@BRSHarish pic.twitter.com/zNBOXMmAto
— M9 NEWS (@M9News_) August 29, 2026