Homeఎంటర్టైన్మెంట్Rajamouli and Anil Ravipudi: రాజమౌళి, అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్స్ ఇవే..

Rajamouli and Anil Ravipudi: రాజమౌళి, అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్స్ ఇవే..

Rajamouli and Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ… ఒక సంవత్సరంలో 200 సినిమాలు రిలీజైతే అందులో కేవలం 10 సినిమాలు మాత్రమే సక్సెస్ లను సాధిస్తుంటాయి. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వాళ్ళను వాళ్ళు డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకుంటూ ప్రేక్షకులకు మెప్పించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెసులు వస్తాయి. అలాగే ప్రేక్షకుల్లో ఒక […]

Rajamouli and Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ… ఒక సంవత్సరంలో 200 సినిమాలు రిలీజైతే అందులో కేవలం 10 సినిమాలు మాత్రమే సక్సెస్ లను సాధిస్తుంటాయి. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వాళ్ళను వాళ్ళు డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకుంటూ ప్రేక్షకులకు మెప్పించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెసులు వస్తాయి. అలాగే ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని కూడా క్రియేట్ చేయగలిగిన వారు అవుతారు. అలాంటి దర్శకుడు ఇప్పటివరకు 12 సినిమాలు చేసి వాటన్నింటిని సక్సెస్ ఫుల్ గా నిలిపాడు. అలాగే అనిల్ రావిపూడి సైతం ఇప్పటివరకు 9 సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక వీళ్ళిద్దరి సక్సెస్ ఫార్ములా ఏంటి అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి రాజమౌళి విజువల్స్ ను చాలా గ్రాండియర్ గా చూపిస్తూనే కథలో కాన్ఫ్లిక్ట్ ను సైతం చాలా ఎక్స్ట్రాడినర్ గా మలుస్తుంటాడు. ఎక్కడ కూడా ఎమోషన్స్ ను డల్ చేయకుండా ఎలివేషన్స్ ను సైతం భారీ రేంజ్ లో ఇస్తూ ప్రేక్షకుల్లో ఒక క్రేజ్ ను క్రియేట్ చేశాడు.

అందుకే ఆయన ప్రతి సినిమాతో సక్సెస్ అవుతున్నాడు. అందువల్లే అతనికి వరుస విజయాలైతే వస్తున్నాయి. ఇక అనిల్ రావిపూడి సైతం కామెడీ సినిమాలను చేస్తాడు. యాక్షన్ ఎంటర్టైనర్లను చేస్తూ సినిమాల్లో కమర్షియల్టీని తగ్గకుండా ఎక్కడా కూడా సినిమా యొక్క హైప్ పడిపోకుండా, ఎప్పటికప్పుడు క్లారిటి గా చూసుకుంటూ సక్సెస్ లను సాధించడంలో ఆయన కూడా ముందు వరుసలో ఉన్నాడు.

ఆయన తన సినిమాల్లో కూడా ఎమోషనల్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. కొన్ని ఎలివేషన్ సీన్స్ ని సైతం హ్యాండిల్ చేయడంలో ఆయన చాలావరకు సక్సెస్ అయ్యాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి చేస్తున్న సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper