Homeజాతీయ వార్తలుAustralian couple: ఓ ఆస్ట్రేలియన్ జంట.. ఇండియన్ పెళ్లి.. మనవాళ్లకు సాలిడ్ స్లిప్పర్ షాట్

Australian couple: ఓ ఆస్ట్రేలియన్ జంట.. ఇండియన్ పెళ్లి.. మనవాళ్లకు సాలిడ్ స్లిప్పర్ షాట్

Australian couple: అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తారు. అన్ని విధాలుగా ఓకే అనుకుంటేనే పెళ్లికి సిద్ధం అవుతారు. పెళ్లి అనగానే ఏదో తప్పనిసరి తంతులాగా కాకుండా.. బ్రహ్మాండంగా చేస్తారు.. వధూవరులకు ఒక జీవితకాలపు జ్ఞాపకాన్ని అందిస్తారు. అందువల్లే ప్రపంచ వివాహ వ్యవస్థల్లో కంటే భారత వివాహ వ్యవస్థ గొప్పగా వర్ధిల్లుతోంది. నేటి కాలంలో భారతీయ యువత ధోరణి పూర్తిగా మారిపోతుంది. మనదేశ వైవాహిక వ్యవస్థను వారు అంతగా అనుసరించడం లేదు… చదువు.. ఉద్యోగం.. […]

Australian couple: అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తారు. అన్ని విధాలుగా ఓకే అనుకుంటేనే పెళ్లికి సిద్ధం అవుతారు. పెళ్లి అనగానే ఏదో తప్పనిసరి తంతులాగా కాకుండా.. బ్రహ్మాండంగా చేస్తారు.. వధూవరులకు ఒక జీవితకాలపు జ్ఞాపకాన్ని అందిస్తారు. అందువల్లే ప్రపంచ వివాహ వ్యవస్థల్లో కంటే భారత వివాహ వ్యవస్థ గొప్పగా వర్ధిల్లుతోంది.

నేటి కాలంలో భారతీయ యువత ధోరణి పూర్తిగా మారిపోతుంది. మనదేశ వైవాహిక వ్యవస్థను వారు అంతగా అనుసరించడం లేదు… చదువు.. ఉద్యోగం.. కెరియర్.. ఇలా అనేక విషయాలలో విదేశీ సంస్కృతిని ఫాలో అవుతున్నారు. చివరికి వివాహాల విషయంలో కూడా మన సంస్కృతి సంప్రదాయాలను పాటించడం లేదు. కేవలం విదేశీ కల్చర్ ను మాత్రమే అనుసరిస్తున్నారు. విదేశాలలో ఉంటూ.. విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటూ.. ఇండియాకు వస్తే ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అనే అనుమానంతో.. అక్కడే పెళ్లి చేసుకుంటున్నారు. కన్నవాళ్ళకు ఆ దృశ్యాలను మొత్తం ఆన్లైన్లో చూపిస్తున్నారు.

మన సంస్కృతిని సంప్రదాయాలను మర్చిపోతున్న నేపథ్యంలో.. మన దేశపు యువతకు ఒక ఆస్ట్రేలియన్ జంట అద్భుతమైన పాఠం చెప్పింది.. ఆస్ట్రేలియా చెందిన బ్రాడీ.. ఎమిలీ అనే జంట మనదేశ హిందూ వివాహ సంప్రదాయాలకు ఫిదా అయిపోయింది. విశాఖపట్నం నగరానికి చెందిన ఉత్తమ మిత్రులు రణ సూర్య.. సృజన దంపతుల వివాహానికి వారు అతిధులుగా వచ్చారు. ఇక్కడి ఆచారాలను అమితంగా ఇష్టపడ్డారు. అదే స్థాయిలో తాము కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మంగళ వాయిద్యాలు.. బంధుమిత్రుల సమక్షంలో మరోసారి వివాహం చేసుకున్నారు. పట్టుబట్టలు ధరించి.. వేదమంత్రాల సాక్షిగా.. అగ్ని చుట్టూ తిరుగుతూ వారిద్దరు దంపతులయ్యారు.. ఏలి మెడలో బ్రాడీ తాళికట్టి.. తన హిందూ వివాహ ముచ్చటను తీర్చుకున్నాడు.

వివాహం పూర్తయిన తర్వాత ఏలికి బ్రాడీ అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ మురిసిపోయాడు. సృజన రణ సూర్య వివాహానికి వచ్చిన బంధువులు బ్రాడీ.. ఏలి దంపతులను మనస్ఫూర్తిగా దీవించారు. నిండు మనసుతో దగ్గరికి తీసుకున్నారు. వివాహ వేదిక మీద వారిద్దరూ ఆసీనులై ఉండగా.. రణ సూర్య.. సృజన తరఫు బంధువులు అక్షితలు చెల్లి.. అతని ప్రేమను వారి మీద వ్యక్తం చేశారు. నేటి కాలంలో మన దేశ వివాహ వ్యవస్థను చిన్నచూపు చూస్తున్న మన దేశపు యువతకు బ్రాడీ.. ఏలి స్లిప్పర్ షార్ట్ లాంటి గుణపాఠం చెప్పారు. ఎంతైనా మన దేశ వైవాహిక వ్యవస్థ చాలా గొప్పది. దానిని చూసి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper