Homeజాతీయ వార్తలుVijay Cycle Campaig: ఎన్టీఆర్, చంద్రబాబు, విజయ్.. సైకిల్ ఎక్కినోడు ఓడిన చరిత్ర లేదు..

Vijay Cycle Campaig: ఎన్టీఆర్, చంద్రబాబు, విజయ్.. సైకిల్ ఎక్కినోడు ఓడిన చరిత్ర లేదు..

Vijay Cycle Campaig: పేదవాడి వాహనం సైకిల్. అయితే ఇప్పుడు సైకిల్ స్థానంలో ద్విచక్ర వాహనాలు రాజ్యమేలుతున్నాయి. కానీ సైకిల్ కి ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. పైగా సైకిల్ తొక్కడం ఎంతో ఆరోగ్యం కూడా. గమ్యస్థానాలకు చేర్చడమే కాదు… వ్యాయామం రూపంలో ఆరోగ్యాన్ని ఇస్తుంది కూడా సైకిల్. ఇక సైకిల్ దేశంలో సృష్టించిన ప్రభంజనం అంతా కాదు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తరువాత.. ఆ పార్టీకి సైకిల్ గుర్తు […]

Vijay Cycle Campaig: పేదవాడి వాహనం సైకిల్. అయితే ఇప్పుడు సైకిల్ స్థానంలో ద్విచక్ర వాహనాలు రాజ్యమేలుతున్నాయి. కానీ సైకిల్ కి ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. పైగా సైకిల్ తొక్కడం ఎంతో ఆరోగ్యం కూడా. గమ్యస్థానాలకు చేర్చడమే కాదు… వ్యాయామం రూపంలో ఆరోగ్యాన్ని ఇస్తుంది కూడా సైకిల్. ఇక సైకిల్ దేశంలో సృష్టించిన ప్రభంజనం అంతా కాదు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తరువాత.. ఆ పార్టీకి సైకిల్ గుర్తు కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. మళ్లీ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీకి అదే సింబల్ దక్కింది. యూపీని పక్కన పెడితే ఏపీలో చిరస్మరణీయమైన విజయాలను దక్కించుకుంది సైకిల్ పార్టీ. ఏం ముహూర్తాన సైకిల్ గుర్తు వచ్చిందో కానీ.. అదే సైకిల్ పై ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు నందమూరి తారక రామారావు. తర్వాత చంద్రబాబు సైతం తరచూ తన ఎన్నికల ప్రచారంలో సైకిల్ పై వెళ్లడం ఆనవాయితీ. ఆయన సైతం మంచి విజయాలనే దక్కించుకున్నారు. అయితే వీరిద్దరిని స్ఫూర్తిగా తీసుకున్నారు ఏమో కానీ.. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సైకిల్ పై అలరించారు విజయ్. అక్కడ మిగతా రెండు పార్టీలకు వెనక్కి నెట్టి దూసుకెళ్లారు. అందుకే సైకిల్ తొక్కిన వాడు చరిత్రలో ఓడిపోడు అంటూ సోషల్ మీడియాలో హోరు ఎత్తుతోంది.

* ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తూ
వాస్తవానికి తమిళనాడు ఎన్నికల ప్రచారంలో విజయ్ సైకిల్ పై వెళ్లడమే కాదు.. ఆ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పేరు కూడా పలుమార్లు ఉచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ పేరును గుర్తుచేసుకున్నారు. సినిమా వాడు ఏం చేస్తాడు అనే ప్రశ్నకు 9 నెలల కాలంలోనే నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. టీవీ కేకు కూడా అదే మాదిరిగా విజయం అందించాలని తమిళనాడు ప్రజలను కోరారు విజయ్. అందుకే దశాబ్దాల చరిత్ర కలిగిన.. డీఎంకే తో పాటు అన్న డీఎంకే ను వెనక్కి నెట్టి మెజారిటీ సీట్లను సొంతం చేసుకున్నారు విజయ్. ప్రస్తుతం విజయ్ నోటి నుంచి వచ్చిన ఎన్టీఆర్ మాటలు… సైకిల్ పై ఎన్నికల ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

* సరిగ్గా క్రెడిట్ చోరీతో..
తమిళనాడులో విజయ్ గెలుపును క్రెడిట్ చోరీ చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోను విజయ్ చూపించారని.. దాని ఫలితంగానే అక్కడి ప్రజలు విజయ్ ను గెలిపించారు అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేసుకున్న మాటలు. అయితే ఇప్పుడు విజయ్ సైకిల్ పై ఎన్నికల ప్రచారం.. ఆపై ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తూ తమిళనాడు ఓటర్లను కోరడం ఇప్పుడు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. చివరకు నేను సైకిల్ తొక్కుతా అంటూ జగన్మోహన్ రెడ్డి అన్నట్టు.. ఆ పార్టీ సింబల్ ను పెడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఇప్పుడు సైకిల్ అనేది ట్రెండిగా నిలవడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper