Telangana Smart Ration Card: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీని ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది. అయితే చాలామంది తమ పేర్లు కనిపించడం లేవని లేదా తమకు కార్డులు రాలేదని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా తమ వివరాలు ఉన్నాయో లేదో అని అనుకుంటున్నారు. అయితే రేషన్ కార్డులు రేషన్ డీలర్ల వద్దకు రాకపోయినా ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందులో నుంచి తమ వివరాలు సరిగా ఉన్నాయా? లేవా? చూసుకొని ఆ తర్వాత కార్డును డౌన్లోడ్ చేసుకుని ఆప్షన్ ఉంటుంది. ఆ వివరాలు లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.43 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ కార్డులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే కొంతమంది ఈ కేవైసీ లేదా ఇతర కారణాలతో తమకు కార్డులు రాకపోవచ్చు. కానీ ఆన్లైన్లో మాత్రం వారి వివరాలను చెక్ చేసుకునే అవకాశం ఉంటుందని కొంతమంది అధికారులు తెలుపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్రానికి వెళ్లకుండా ఇంట్లోనే మొబైల్ ద్వారా కూడా తనిఖీ చేసుకోవచ్చు.
ఇందుకోసం ముందుగా తెలంగాణ పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అధికారిక పోర్టల్ epds ను సంప్రదించాలి. మొబైల్ లో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత దీనిని టైప్ చేసి ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ FSC Search అనే ఆప్షన్లోకి వెళ్ళగానే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ముందుగా ఇక్కడ ఉన్న కొన్ని బాక్సుల్లో మీ జిల్లా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత FPS నెంబర్ లేదా రేషన్ కార్డుకు సంబంధించిన నెంబర్ ను టైప్ చేసి సెర్చ్ అని కొట్టాలి. అప్పుడు లబ్ధిదారుడికి సంబంధించిన వివరాలు డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ లోకి వెళ్లి రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అయితే ఆన్లైన్లో కూడా తమ వివరాలు కనిపించకపోతే సంబంధిత డీలర్ ను సంప్రదించాలి. అంతేకాకుండా ఆ ఏరియా ఆర్డీవో ను సంప్రదించిన కూడా తమ కార్డు ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసుకోవచ్చు. అయితే అన్ని వివరాలు సరిగ్గా ఉన్నవారికి స్మార్ట్ కార్డులు అందజేశారు. ఇకనుంచి ఈ కార్డుల ద్వారానే రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు పారదర్శకంగా సరుకులు అందించాలన్న ఉద్దేశంతోనే దీనిని ప్రవేశపెట్టినట్లు పాలకులు చెబుతున్నారు.