Chandrababu: సాధారణంగా ముఖ్యమంత్రి అంటే ఫైళ్లు, సమీక్షలు, సంతకాలు, వీడియో కాన్ఫరెన్స్ లు, టెలి కాన్ఫరెన్స్ లతో బిజీగా ఉంటారు. ప్రైవేట్ లైఫ్ కంటే పబ్లిక్ లైఫ్ లోనే ఎక్కువగా గడుపుతారు. కుటుంబ జీవనానికి కూడా తక్కువ సమయం కేటాయిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు గురించి చెప్పనవసరం లేదు. రోజుకు 16 గంటలకు పైగా పబ్లిక్ లైఫ్ లోనే ఆయన ఉంటారు. కుటుంబానికి వెచ్చించే సమయం చాలా తక్కువ. డ్రెస్ సెన్స్ కూడా చాలా సింపుల్. అటువంటి చంద్రబాబు ఓ విషయంలో మాత్రం ప్రత్యేకం. ఆ విషయం అమరావతిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ప్రారంభోత్సవ సమయంలో బయటపడింది. చంద్రబాబులో ఈ కోణం ఉందా? అనే చర్చ జరిగింది.
* క్వార్టర్స్ ప్రారంభోత్సవంలో..
అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డును చంద్రబాబు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాటితో పాటు స్టీల్ బ్రిడ్జిలను సైతం ప్రారంభించారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పూర్తి కావడంతో వాటిని సైతం ప్రారంభించారు. ఈ క్రమంలో నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని ఫ్లాట్స్ ను ప్రత్యేకంగా సందర్శించారు. ఈ క్రమంలో ఓ వాష్ రూమ్ పరిశీలనలో భాగంగా చంద్రబాబు అక్కడ ఉన్న అద్దాన్ని చూసి.. తన జేబులో ఉన్న దువ్వెన తీసుకున్నారు. తల దువ్వుకున్నారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఆయనకు దగ్గరగా చూసే సొంత మనుషులు, సిబ్బందికి ఈ విషయం తెలుసు. కానీ బయట ప్రపంచానికి తెలియడం ఇదే మొదటిసారి. దీంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది.
* యుక్త వయసు నుంచి అలవాటు..
చంద్రబాబు క్రాఫ్ బాగుంటుంది. చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది. అయితే దాని వెనుక దువ్వెన కథ ఉంది. నిత్యం చంద్రబాబు జేబులో దువ్వెన ఉంటుందట. యుక్త వయసు నుంచి అదో అలవాటు ఆట. ఆయన మాత్రమే కాదు.. ఆ తరంలో ఉండే చాలామంది నేతలు ఇలానే దువ్వెన జేబులో పెట్టుకుంటారు. అయితే సాధారణంగా రాజకీయ నాయకులు తమ కార్లలో సైతం ఈ దువ్వెనను అందుబాటులో ఉంచుకుంటారు. పబ్లిక్ లోకి వెళ్లేటప్పుడు చరిష్మ చూపించేందుకు. అయితే చంద్రబాబుకు వ్యక్తిగత ఆసక్తులు అనేవి పెద్దగా కనిపించేవి కావు. కానీ జేబులో నిత్యం దువ్వెన ఉంచుకుంటారని తెలియడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అద్దం చూసి తలదువుకోవడానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram