Homeక్రీడలుక్రికెట్‌MS Dhoni: అటు దేశభక్తి.. ఇటు విశ్వాసం.. ధోని అంటే ఇందుకే స్పెషల్

MS Dhoni: అటు దేశభక్తి.. ఇటు విశ్వాసం.. ధోని అంటే ఇందుకే స్పెషల్

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్.. వన్డే వరల్డ్ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత ఇతడిది. టీమిండియాలో అత్యంత విజయవంతమైన సారధిగా పేరు తెచ్చుకున్న ఆటగాడు ఇతడు. తిరుగులేని స్థాయిని.. అపరిమితమైన ఖ్యాతిని అందుకున్న క్రికెటర్ ఇతడు. ధోని ఏం చేసినా సరే గొప్పగానే ఉంటుంది. వికెట్ల వెనుక అతని వ్యూహాలు ఒక పట్టాన కొరుకుడు పడవు. బంతిని వేగంగా అంచనా వేసే అతడు.. అదే సమయంలో వేగంగా […]

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్.. వన్డే వరల్డ్ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఘనత ఇతడిది. టీమిండియాలో అత్యంత విజయవంతమైన సారధిగా పేరు తెచ్చుకున్న ఆటగాడు ఇతడు. తిరుగులేని స్థాయిని.. అపరిమితమైన ఖ్యాతిని అందుకున్న క్రికెటర్ ఇతడు.

ధోని ఏం చేసినా సరే గొప్పగానే ఉంటుంది. వికెట్ల వెనుక అతని వ్యూహాలు ఒక పట్టాన కొరుకుడు పడవు. బంతిని వేగంగా అంచనా వేసే అతడు.. అదే సమయంలో వేగంగా పట్టుకొని వికెట్లను పడగొడతాడు. ఓడిపోయే మ్యాచ్లను సైతం తన నైపుణ్యంతో గెలిపించి.. టీమ్ ఇండియాకు ఎన్నో ట్రోఫీలు అందించాడు. అందువల్లే ధోనిని టీమిండియాలో అత్యంత విజయవంతమైన సారథిగా పిలుస్తూ ఉంటారు.

ధోని క్రికెటర్ గా.. బాధ్యత కలిగిన కుమారుడిగా.. ప్రేమను కురిపించే భర్తగా.. అనురాగాన్ని పంచే తండ్రిగా.. ఇలా ఎన్నో పాత్రలను పోషిస్తున్నాడు. ధోనిలో కనిపించని మరో క్వాలిటీ కూడా ఉంది. క్రికెట్ నైతే అతడు ఏ స్థాయిలో ప్రేమిస్తాడో.. అంతకుమించి దేశాన్ని ప్రేమిస్తాడు. అందువల్లే అతడు సైన్యంలో పనిచేశాడు. చాలా కొద్ది మందికి మాత్రమే ధోనిలో ఉన్న ఈ కోణం తెలుసు. తన స్థాయి గొప్పగా ఉన్నప్పటికీ.. దానిని మొత్తం పక్కన పెట్టి సైనికులతో కలిసి దేశ సంరక్షణలో పాల్గొన్నాడు. దేశ సరిహద్దుల్లో చాలా రోజులపాటు సైనిక వ్యవహారాలలో పాలుపంచుకున్నాడు. దేశ సరిహద్దుల్లో సైనికులు పడుతున్న ఇబ్బందులను అతడు ప్రత్యక్షంగా చూశాడు.

ధోని దేశం మీద చూపించే ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి ఏడాది స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకల సమయంలో ధోని జాతీయ జెండాను ఎగరవేస్తాడు. తన వ్యవసాయ క్షేత్రంలో తన పెంపుడు కుక్కలతో స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటాడు. దేశభక్తి అంటే మరి ఏదో కాదని.. సాటి మనుషుల మీద ప్రేమను చూపించడమేనని.. దానిని కడదాకా చూపిస్తేనే దేశ పౌరుడిగా మన జన్మకు సార్ధకత లభిస్తుందని ధోని పరోక్షంగా చెబుతుంటాడు.. ధోని దేశభక్తి గురించి.. అతడి జాతీయత భావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడు ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నాడు. తాజాగా ఝార్ఖండ్ రాష్ట్రంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ధోని స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నాడు. జాతీయ జెండాను ఎగరేశాడు. తన పెంపుడు కుక్కతో కలిసి ఫొటోలు దిగాడు. వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్గ్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by MS Dhoni Fan Page (@m_s.dhoni)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper