Homeఆంధ్రప్రదేశ్‌AP Legislative Council: ఏపీ శాసనమండలిలో సంచలనం?!

AP Legislative Council: ఏపీ శాసనమండలిలో సంచలనం?!

AP Legislative Council: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నాలుగు రోజులపాటు జరగనున్నాయి. అయితే అసెంబ్లీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం లేదు. మండలిలో మాత్రం ఆ పార్టీ మరోసారి గళం ఎత్తే అవకాశం ఉంది. అందుకే అందరి దృష్టి మండల పై పడింది. ప్రధానంగా ఈసారి డీఎస్సీ 2025 పై చర్చ జరగనుంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. అయితే ఇప్పటికే వైయస్సార్ […]

AP Legislative Council: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నాలుగు రోజులపాటు జరగనున్నాయి. అయితే అసెంబ్లీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం లేదు. మండలిలో మాత్రం ఆ పార్టీ మరోసారి గళం ఎత్తే అవకాశం ఉంది. అందుకే అందరి దృష్టి మండల పై పడింది. ప్రధానంగా ఈసారి డీఎస్సీ 2025 పై చర్చ జరగనుంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. అయితే ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన సందేహాలను, సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా స్పష్టతనిచ్చింది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది. కేవలం అనుమానాలే తప్ప ఆధారాలు చూపు లేకపోవడంతో కోర్టు కొట్టు వేసింది. అయితే ఇప్పుడు డీఎస్సీ 2025 పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీత పై.. ఎదురుదాడికి సిద్ధమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం ఎక్కువ కాబట్టి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు చర్చ.

* అన్నట్టుగానే భారీ భర్తీ..
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తొలి ఫైల్ గా డీఎస్సీ పైనే సంతకం చేశారు. అనుకున్నట్టుగానే 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. సకాలంలో నియామక ప్రక్రియ పూర్తి చేసి ఉపాధ్యాయులను నియమించారు కూడా. అయితే ఇది జరిగి ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు డీఎస్సీలో అక్రమాలు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. కేవలం అనుమానాలతోనే ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతుండగా.. కనీస ఆధారాలు చూపలేకపోతోంది ఆ పార్టీ. అయితే దీనిపై డీఎస్సీ 2025 ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మగౌరవం పేరుతో భారీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. రాయలసీమతో పాటు విజయవాడలో వేలాదిమంది ఉపాధ్యాయులు నిరసన బాట పట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గడం లేదు.

* బలమైన చర్చ..
అయితే విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. డీఎస్సీ 2025లో అక్రమాలపై బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నది వైసిపి డిమాండ్. అయితే ఇదే అంశంపై మండలిలో పట్టుబడితే లోకేష్ కచ్చితంగా విరుచుకుపడతారు. ఎందుకంటే డీఎస్సీ 2025 పై చర్చించేందుకు ఏకంగా ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. తనతో చర్చకు రావాలని కోరారు. ఇప్పుడు కానీ వైసీపీ ఎమ్మెల్సీలు దీనిపై ప్రశ్నిస్తే లోకేష్ కచ్చితంగా స్పందించి వివరణ ఇస్తారు. ఈ క్రమంలో చాలా రకాల సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి మండలి పై పడింది. కానీ మండలి నుంచి ఆ స్థాయిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఎవరు చేస్తారా? చూడాలి. కచ్చితంగా లోకేష్ మాత్రం ఫుల్ ప్రిపరేషన్ తో వస్తారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. చూడాలి మరి ఎలాంటి సంచలనాలు నమోదు అవుతాయో…

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper