Homeజాతీయ వార్తలుVijay 100 Days Government: టీవీ కే విజయ్ వందరోజుల పాలన.. పండగ చేసుకున్న తెలుగు...

Vijay 100 Days Government: టీవీ కే విజయ్ వందరోజుల పాలన.. పండగ చేసుకున్న తెలుగు మీడియా

Vijay 100 Days Government:  సాధారణంగానే తమిళ రాజకీయ నాయకులు విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటారు. తన మీడియా పబ్లిసిటీ కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. గతంలో తమిళనాడు నాయకులు తమిళ మీడియాలో మాత్రమే ప్రకటనలు ఇచ్చేవారు. ఇప్పుడు తమిళ నాయకుడు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జాతీయ మీడియా విపరీతంగా హైలెట్ చేసింది. ఇక ఆ తర్వాత విజయ్ వేసే […]

Vijay 100 Days Government:  సాధారణంగానే తమిళ రాజకీయ నాయకులు విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటారు. తన మీడియా పబ్లిసిటీ కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. గతంలో తమిళనాడు నాయకులు తమిళ మీడియాలో మాత్రమే ప్రకటనలు ఇచ్చేవారు. ఇప్పుడు తమిళ నాయకుడు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జాతీయ మీడియా విపరీతంగా హైలెట్ చేసింది. ఇక ఆ తర్వాత విజయ్ వేసే ప్రతి అడుగును జాతీయ మీడియా జాగ్రత్తగా పరిశీలించింది. విజయ్ ఆ మధ్య ఒక సభ తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో చాలామంది చనిపోయారు. చనిపోయిన కుటుంబాలకు విజయ్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అయితే వాటిని తమిళనాడు హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చింది. దీంతో విజయ్ ప్రభుత్వం మీద ఉన్న ఒత్తిడి తగ్గిపోయింది.

సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వం సాధించిన విజయాన్ని నేషనల్ మీడియా ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.. తెలుగు మీడియా కూడా విజయ్ కి విపరీతమైన ప్రయారిటీ ఇస్తోంది.. ఈ నేపథ్యంలోనే విజయ్ తన ప్రభుత్వం ఏర్పడి సోమవారం నాటికి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో.. తెలుగు మీడియాకు బీభత్సంగా ప్రకటనలు చేశారు. తెలుగులో ప్రధాన పత్రికలకు ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు. ఒక్కో యాడ్ ఖరీదు దాదాపు 30 నుంచి 40 లక్షల దాకా ఉంటుంది. అయినప్పటికీ ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా విజయ్ ప్రకటనలు ఇచ్చేశారు.

విజయ్ సినిమా రంగానికి చెందిన వ్యక్తి. ఆయనకు బలమైన పిఆర్ వ్యవస్థ ఉంది. ఆ సినిమా వ్యవస్థనే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన పాటిస్తున్నారు. సోమవారం ఆయన ఇచ్చిన ప్రకటనలో 200 యూనిట్ల విచిత్ర విద్యుత్.. సింగపెన్ టాస్క్ ఫోర్స్.. 717 తస్మాక్ షాపుల మూసివేత వంటి నిర్ణయాలను హైలెట్ చేసుకున్నారు. అయితే తమిళ ప్రజలు చెల్లించే డబ్బులతో ఇలా ఇతర రాష్ట్రాల మీడియాకు ప్రకటనలు ఇవ్వడం ద్వారా విజయ్ సాధించే ప్రయోజనం ఎంత.. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో శాంతి భద్రతల లోపం ఉంది. విద్యుత్ కోతలు ఉన్నాయి. కొత్త మంత్రులు అనుభవరాహిత్యంగా కనిపిస్తున్నారు. వీటిని పక్కనపెట్టి పత్రికా ప్రకటనలు ఇచ్చి విజయ్ ఏం సాధిద్దాం అనుకున్నారు. సినిమాలలో పత్రికా ప్రకటన ద్వారా ఫస్ట్ డే కలెక్షన్లు సాధించుకోవచ్చు. రాజకీయాలలో ఇది సాధ్యం కాదు. విజయ్ ఇది తెలుసుకుంటే మంచిది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper