KTR: నా బిడ్డ రేపు అమెరికా పోవాలి. నేను పంపించి రావాలి. నా బిడ్డ అమెరికాలో చదువుకుంటానని చెప్పింది. ఎందుకు అని నేను అడిగిన. అంత గొప్ప కాలేజీలు మన ఇండియాలో ఎక్కడ ఉన్నాయి అని నా బిడ్డ అడిగితే దానికి సమాధానం లేదు. మన దేశం శ్రీలంక కంటే వెనుకబడి ఉంది.. ఇది ఇటీవల భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.
2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. 10 ఏళ్లకాలం అంటే అంత తక్కువ సమయం కాదు. ఇంతటి సుదీర్ఘకాలంలో ఏదైనా చేయవచ్చు. అద్భుతాన్ని సాకారం చేయవచ్చు. దేశం మోడీ పరిపాలనలో ఉంది కాబట్టి.. జాతీయస్థాయి విద్యాసంస్థలను పక్కన పెడితే.. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రతిష్టత్మకమైన యూనివర్సిటీని లేదా ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థను భారత రాష్ట్ర సమితి ఎందుకు నెలకొల్పలేకపోయింది.. చేతిలో డబ్బు బాగానే ఉంది కదా.. అధికారం కూడా స్థిరంగానే ఉంది కదా.. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో మార్పులు ఎందుకు చేపట్టలేకపోయారు.. సరికొత్త విధానాలకు ఎందుకు శ్రీకారం చుట్టూ లేకపోయారు.. ఇదేదో మేము చేస్తున్న విమర్శ కాదు. సాక్షాత్తు కేటీఆర్ మాట్లాడిన మాటలకు చెబుతున్న సమాధానం…
మనదేశంలో రాజకీయ నాయకుల పిల్లలు విదేశాలలో చదువుతూ ఉంటారు. చివరికి విపక్ష పార్టీల నాయకుల పిల్లలు కూడా విదేశాలలో చదువుతుంటారు. విదేశాలలో ఏది ఉచితంగా రాదు. అక్కడ రాజకీయ నాయకుల పిల్లలైనంత మాత్రాన రెడ్ కార్పెట్ స్వాగతం ఉండదు. ప్రతిదీ కొనుక్కోవాలి. మనదేశంలో రాజకీయ నాయకుల దగ్గర దండిగా డబ్బు ఉంటుంది కాబట్టి కోట్లు చెల్లించి.. సీట్లు కొనుక్కుంటారు. అక్కడ తమ పిల్లలను చదివిస్తుంటారు. ఇక్కడ మాత్రం పేద, మధ్య తరగతి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని సూచిస్తుంటారు. ఇదే అంతరమో అర్థం కాదు. అంటే రాజకీయ నాయకుల పిల్లలు గొప్ప గొప్ప యూనివర్సిటీలలో చదవాలి. వాళ్లకు ఓట్లు వేసి గెలిపించే ఓటర్ల పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చదవాలి. ఇది వారు చెప్పే నైతికత.
మనదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు.. ఐఐఎం విద్యాసంస్థలు ఉన్నాయి. ఇందులో సీటు సాధించుకోవడం అంత ఈజీ కాదు. అత్యంత కట్టెలమైన పరీక్షలు ఎదుర్కోవాలి. వాటిలో ఉత్తమమైన మార్కులు సాధించాలి. ఇలా సాధించాలంటే చాలా కష్టం. ఇలా సాధించలేకనే చాలామంది రాజకీయ నాయకుల తమ పిల్లల్ని కోట్లు పోసి విదేశాలలో చదివిస్తున్నారు. పైగా మన దేశ విద్యా వ్యవస్థను కించపరిచే విధంగా మాటలు మాట్లాడుతున్నారు. కనీసం బోర్డు పరీక్షలు కూడా రాసే స్థాయిలో రాజకీయ నాయకుల పిల్లలు ఉండరు.
సామాన్యులైన విద్యార్థులు బ్యాంకు రుణాలు తీసుకొని.. ప్రతిభను మాత్రమే నమ్ముకుని విదేశాలకు వెళ్తుంటారు.. రాజకీయ నాయకుల పిల్లలు మాత్రం కోట్లు తగలేసి విదేశీ విద్యాసంస్థలలో సీట్లు పొందుతుంటారు. పైగా దీనిని స్టేటస్ సింబల్ లాగా భావిస్తుంటారు. తమ పిల్లలు ప్రవేశ పరీక్షలు రాకుండానే.. విదేశీ విద్య చదవడానికి గొప్పగా చెప్పుకునే రాజకీయ నాయకులు.. మన దేశంలో ఉన్న విద్యాసంస్థల స్థాయిని తగ్గించి మాట్లాడటం నిజంగా అనుభవ రాహిత్యమే. ఈ దేశం మీద.. ఇక్కడి ప్రజల మీద.. ఇక్కడ వ్యవస్థల మీద నమ్మకం లేని వ్యక్తులు ఎవరైనా సరే దేశం దాటి వెళ్లిపోవచ్చు. ఎందుకంటే దేశం మీద ప్రేమ లేని వాడికి దేశంలో ఉండే హక్కు లేదు. దేశం గురించి మాట్లాడే హక్కు ఏమాత్రం లేదు.