HomeతెలంగాణRevanth Reddy: ఒక్క దెబ్బతో రెండు పిట్టలు.. ఆయువు పట్టుపై కొడుతోన్న రేవంత్

Revanth Reddy: ఒక్క దెబ్బతో రెండు పిట్టలు.. ఆయువు పట్టుపై కొడుతోన్న రేవంత్

Revanth Reddy: కొన్ని విషయాలలో రేవంత్ రెడ్డి ని విభేదించవచ్చు. కానీ, కొన్ని నిర్ణయాలలో మాత్రం రేవంత్ రెడ్డిని కచ్చితంగా అభినందించాలి. అందులో ఇది ప్రముఖంగా నిలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అటువంటిది కాబట్టి.. తెలంగాణ రాష్ట్రంలో అహర కల్తీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇక అక్రమ మందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాదకద్రవ్యాల వ్యాప్తి.. తయారీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఎన్ని రకాలుగా ఆపరేషన్లు చేపట్టినప్పటికీ […]

Revanth Reddy: కొన్ని విషయాలలో రేవంత్ రెడ్డి ని విభేదించవచ్చు. కానీ, కొన్ని నిర్ణయాలలో మాత్రం రేవంత్ రెడ్డిని కచ్చితంగా అభినందించాలి. అందులో ఇది ప్రముఖంగా నిలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అటువంటిది కాబట్టి..

తెలంగాణ రాష్ట్రంలో అహర కల్తీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇక అక్రమ మందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాదకద్రవ్యాల వ్యాప్తి.. తయారీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఎన్ని రకాలుగా ఆపరేషన్లు చేపట్టినప్పటికీ ఈ వ్యవహారానికి అడ్డుకట్ట పడడం లేదు. దీనికి తోడు కొంతమంది పోలీసులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. ఇది వ్యవస్థకు తీరని నష్టం చేకూర్చుతోంది.

ఆహార కల్తీ విషయంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మొదలుపెడితే వరంగల్ వరకు ప్రతి హోటల్లో కూడా ఆహార కల్తీ జరుగుతోంది. ఏదో అధికారులు తనిఖీలు చేసినప్పుడు మాత్రమే హడావిడి ఉంటుంది. ఆ తర్వాత ఎప్పటిలాగానే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఆహారాన్ని కొనుక్కుని మరి ప్రజలు రోగాలు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఆహార తనిఖీ శాఖ అధికారులు చేసిన దాడులలో దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. కల్తీ ఆహార పదార్థాల తయారీ ఒక పరిశ్రమ లాగా ఎలా మారిపోయిందో కళ్ళకు కట్టింది.

ఆహార కల్తీ.. అక్రమ మందుల వ్యవహారాన్ని తొక్కి పెట్టడానికి రేవంత్ రెడ్డి ఏకంగా తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫుడ్ అండ్ ఎస్ ఎన్ సి ఎల్ డ్రగ్స్ ( టీజీ సేఫ్) అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రకటించారు. హైదరాబాద్ నుంచి మొదలుపెడితే మారుమూల జిల్లాల వరకు ఆహార కల్తీ.. అక్రమంగా సాగుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని తొక్కి పెట్టడానికి ఈ వ్యవస్థ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.. ఆహార భద్రతను.. ఔషధ నియంత్రణను ఒకే పరిపాలన వ్యవస్థ కిందికి తీసుకొస్తామని.. దానికి టీజీ సేఫ్ అని పేరు పెడతామని రేవంత్ ప్రకటించారు. పరిపాలనపరంగా జరిగే ప్రయోజనాల కోసమే ఈ విలీనాన్ని తీసుకొచ్చామని రేవంత్ ప్రకటించారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా అవినాష్ మెహంతి పనిచేస్తున్నారు. ఆయన తన పరిపాలనపరమైన విధులతో పాటు టీజీ సేఫ్ కమిషనర్ గా కూడా పనిచేస్తారు. టీజీ సేఫ్లో మొత్తంగా ఆరు విభాగాలు ఉంటాయి.. ఈ విభాగాలు తనిఖీలు చేపడతాయి. పటిష్టమైన నిఘా పెడతాయి. ముందుగా ఈ వ్యవస్థ క్యూర్ భాగంలో పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మిగతా ప్రాంతాలలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆహార కల్తీ.. అక్రమంగా సాగే మాదకద్రవ్యాల వ్యాపారాన్ని ఈ వ్యవస్థ తొక్కి పెడుతూ ఉంటుంది. తద్వారా పౌరులకు స్వచ్ఛమైన ఆహారాన్ని.. మాదక ద్రవ్యాలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper