spot_img
Homeజాతీయ వార్తలుఆ పార్టీలతోనే దీదీకి నష్టం

ఆ పార్టీలతోనే దీదీకి నష్టం

Mamata Banerjee
మరికొద్ది రోజుల్లో పశ్చిమబెంగాల్‌ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటికే అక్కడి రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. జంపింగ్‌లు నడుస్తూనే ఉన్నాయి. ఒకవిధంగా రాష్ట్రం మొత్తం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. బహిరంగ సభలు, సమావేశాలతో పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశాయి. ఇక్కడ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ.. ఇది పైకి కన్పించే అంశమే. అనేక పార్టీలు రంగంలోకి దిగుతుండటంతో మమత బెనర్జీ విజయానికి గండి పడుతుందేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Also Read: మండుతున్న ధరలు..: మోడీపై ఫైర్‌‌ అవుతున్న నెటిజన్లు

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 293 అసెంబ్లీ స్థానాలున్నాయి. 150 స్థానాలు మ్యాజిక్ ఫిగర్‌‌. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఈ ఎన్నికల్లో రావన్నది సుస్పష్టం. అంటే మమత బెనర్జీకి మెజారిటీ అయినా తగ్గాలి. బీజేపీకి గణనీయంగా సీట్ల సంఖ్య పెరగాలి. కానీ.. ప్రస్తుతం కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇక్కడ 193 స్థానాల్లో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కాంగ్రెస్ మరికొన్ని చిన్నా చితకా పార్టీలను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్దేశంలో ఉంది.

ఒకవేళ ఆ కూటమి మాత్రం బలపడితే అది మమత బెనర్జీకి కలిసొచ్చే అంశం. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆ కూటమి చీల్చుకుంటే తమ గెలుపు సులువవుతుందని అనుకున్నారు. కానీ.. రోజురోజుకూ పరిస్థితి చూస్తుంటే చిన్న పార్టీలతోనే తమకు ముప్పు ఉన్నట్లు మమత బెనర్జీ గుర్తించారు. ఇప్పటికే 30 శాతం ఉన్న ముస్లిం ఓట్లు చీలిపోతాయన్న ఆందోళనలో మమత బెనర్జీ ఉన్నారు. ఎంఐఎం పార్టీతో పాటు ఇండియన్ సెక్యులర్ పార్టీలు తనను దెబ్బతీస్తాయన్న ఆందోళనలో మమత బెనర్జీ ఉన్నారు.

Also Read: నెమ్మదించిన కేసీఆర్.. నేడు పుట్టినరోజు

ఇక.. మరో 30 శాతం ఓట్లు ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓట్లపై కూడా రోజురోజుకూ మమత బెనర్జీకి నమ్మకం సన్నగిల్లుతోంది. ఇక్కడ జేఎంఎం, ఆర్జేడీ, జేడీయూ, ఎల్జేపీ, హిందూస్తానీ లెఫ్ట్ ఫ్రంట్, బీఎస్సీ, శివసేన, ఎస్సీ వంటి పార్టీలు కూడా బరిలోకి దిగుతున్నాయి. కులాలు, సామాజిక వర్గాల వారీగా ఈ పార్టీలు ఓట్లు చీల్చుకుంటే మమత బెనర్జీకి ఇబ్బంది తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ పోటీ చేసినా ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. మరి ఈసారి ఏమాత్రం ప్రభావం చూపబోతున్నాయో చూడాలి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Chandrababu

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...
Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Oktelugu Epaper