Homeవింతలు-విశేషాలుMuthaiah Goud: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో రెండు ఎకరాలు.. చేసేది మాత్రం కల్లుగీత..ఈ గౌడ్ సాబ్...

Muthaiah Goud: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో రెండు ఎకరాలు.. చేసేది మాత్రం కల్లుగీత..ఈ గౌడ్ సాబ్ కు హాట్సాఫ్

Muthaiah Goud: కులవృత్తికి సాటేది లేదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కాకపోతే నేటితరం కంప్యూటర్ చదువులో పడి.. కులవృత్తులను మానేసింది. కాకపోతే కులవృత్తులను నమ్ముకున్న వాళ్ళు నేటి కాలంలో కోట్లకు పడగలు ఎత్తుతున్నారు. అటువంటి వారిలో ఇతడు ముందు వరుసలో ఉంటాడు. అతని పేరు ముత్తయ్య.. హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉంటాడు. ఇతడు ఉదయం లేవగానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి శివారు ప్రాంతం వరకు సైకిల్ మీద వెళుతుంటాడు. సైకిల్ కి రెండు […]

Muthaiah Goud: కులవృత్తికి సాటేది లేదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. కాకపోతే నేటితరం కంప్యూటర్ చదువులో పడి.. కులవృత్తులను మానేసింది. కాకపోతే కులవృత్తులను నమ్ముకున్న వాళ్ళు నేటి కాలంలో కోట్లకు పడగలు ఎత్తుతున్నారు. అటువంటి వారిలో ఇతడు ముందు వరుసలో ఉంటాడు.

అతని పేరు ముత్తయ్య.. హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉంటాడు. ఇతడు ఉదయం లేవగానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి శివారు ప్రాంతం వరకు సైకిల్ మీద వెళుతుంటాడు. సైకిల్ కి రెండు వైపులా క్యాన్లు.. మట్టి కుండలు ఉంటాయి. అతడి నడుముకు మోకు.. అందులో కత్తులు ఉంటాయి. అలా అతడు సైకిల్ నడుపుకుంటూ వెళ్తుంటే చాలామంది ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో చాలావరకు కార్లు మాత్రమే వెళ్తూ ఉంటాయి. కానీ ఇతడు సైకిల్ మీద వెళ్లడం చాలామందికి వింతగా.. ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది.

ముత్తయ్య పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు. కాకపోతే తన కుటుంబానికి అనాది కాలం నుంచి అన్నం పెట్టిన కులవృత్తిని అతడు వదులుకోలేదు. మొదట్లో ఈ కుల వృత్తి వల్ల ముత్తయ్య తల్లిదండ్రులు చెప్పుకునే స్థాయిలో సంపాదించలేదు. అలాగని పిల్లల్ని కష్టాలపాలు చేయలేదు. కాకపోతే అప్పుడు వారు ఉన్న ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు ఉండేది కాదు. సిటీ కూడా ఈ స్థాయిలో విస్తరించలేదు. చివరికి ముత్తయ్య ఎదిగిన తర్వాత.. కల్లుగీత మొదలుపెట్టిన తర్వాత కుటుంబ కష్టాలు తీరడం ప్రారంభమైంది. అయితే అప్పట్లోనే వీరికి వంశపారంపర్యంగా కొంత భూమి ఉండేది. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్నది. ఇప్పుడు ముత్తయ్య ఆ కల్లు గీసే వృత్తిని మానలేదు. అదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో రోజు సైకిల్ మీద కల్లు గీసి వస్తూ ఉంటాడు. ఈయన కస్టమర్లు ముందుగానే ఫోన్ చేస్తారు. అడ్వాన్స్ చెల్లింపులు చేస్తారు. వారికి తాటికల్లు సర్వ్ చేసి వస్తుంటాడు. యూత్ నుంచి వృద్ధుల వరకు ఇతనికి కస్టమర్లు ఉన్నారు. నాణ్యమైన తాటికల్లు ఇవ్వడం ఇతని స్పెషాలిటీ. అందువల్లే ఇతడు గీసే తాటికల్లు క్షణంలో అయిపోతూ ఉంటుంది. కల్తీకి ఆస్కారం ఇవ్వడు. లేనిపోని రసాయనాలు కలపడు. ఫైనాన్షియల్ డిస్టిక్ పరిధిలో రెండు ఎకరాల భూమి ఉందంటే ఈ గౌడ్ సాబ్ ఎంత ధనవంతుడో అర్థం చేసుకోవచ్చు. అంత భూమి ఉన్నప్పటికీ బిల్డ్ అప్ ఇవ్వడం లేదు. ఆ స్థాయిలో ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ నడ మంత్రపు సిరిని చూపించడం లేదు. ఇప్పటికీ తాటి చెట్లను మాత్రమే నమ్ముకున్నాడు. సైకిల్ మీద మాత్రమే వెళుతున్నాడు. దీన్నిబట్టి మనోడు ఎంత డౌన్ టు ఎర్తో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ల దగ్గర డబ్బు ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే డబ్బుంటే వారికి ప్రేమ లేదు. మోజు అంతకంటే లేదు. అదేదో సినిమాలో చెప్పినట్టు జస్ట్ వీరికి డబ్బు అవసరం మాత్రమే.

 

View this post on Instagram

 

A post shared by hyderabadinfra (@hyderabadinfra)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper