Homeజాతీయ వార్తలుVijay Trisha: విజయ్, త్రిష విడిపోయారన్నారుగా.. మరి ఇదేంటి.. వైరల్ వీడియో

Vijay Trisha: విజయ్, త్రిష విడిపోయారన్నారుగా.. మరి ఇదేంటి.. వైరల్ వీడియో

Vijay Trisha: మొన్ననే కదా చెంగల్పట్టు కోర్టులో తన విడాకుల కేసును సంగీత వెనక్కి తీసుకుంది.. విజయ్, ఆమె కలిసిపోయారని.. పిల్లలు కూడా తండ్రితో కలిసి ఉండడానికి ఒప్పుకున్నారని.. తమిళ మీడియాలో.. జాతీయ మీడియాలో వార్తలు వచ్చింది.. విజయ్ ఫ్యాన్స్ సంబరాలు కూడా చేసుకుంది.. ఇక్కడితో ఆగిపోలేదు.. విజయ్, త్రిష విడిపోయారని కూడా ప్రచారం జరిగింది. దానిని నిజం చేసే విధంగా పరిణామాలు జరిగిపోయాయి. కొద్దిరోజుల గ్యాప్ లోనే మళ్లీ త్రిష ఎంట్రీ ఇచ్చింది. ఈసారి ఏకంగా […]

Vijay Trisha: మొన్ననే కదా చెంగల్పట్టు కోర్టులో తన విడాకుల కేసును సంగీత వెనక్కి తీసుకుంది.. విజయ్, ఆమె కలిసిపోయారని.. పిల్లలు కూడా తండ్రితో కలిసి ఉండడానికి ఒప్పుకున్నారని.. తమిళ మీడియాలో.. జాతీయ మీడియాలో వార్తలు వచ్చింది.. విజయ్ ఫ్యాన్స్ సంబరాలు కూడా చేసుకుంది.. ఇక్కడితో ఆగిపోలేదు.. విజయ్, త్రిష విడిపోయారని కూడా ప్రచారం జరిగింది. దానిని నిజం చేసే విధంగా పరిణామాలు జరిగిపోయాయి.

కొద్దిరోజుల గ్యాప్ లోనే మళ్లీ త్రిష ఎంట్రీ ఇచ్చింది. ఈసారి ఏకంగా తమిళనాడు స్వాతంత్ర వేడుకలు జరిగే ప్రాంతానికి వచ్చేసింది. విజయ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా జాతీయ జెండా ఎగరవేయగా.. ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి త్రిష వచ్చేసింది. విఐపి గ్యాలరీలో కూర్చుంది. త్రిష సినీ నటి కాబట్టి.. ఆ స్థాయి గౌరవం ఉంటుందని అందరూ అనుకున్నారు. ఆమె కూర్చుంది విఐపి గ్యాలరీలో.. కాకపోతే విజయ్ తల్లిదండ్రుల పక్కన.. గతంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా త్రిష ఆ కార్యక్రమానికి హాజరైంది. అప్పుడు కూడా విజయ్ తల్లిదండ్రుల పక్కన కూర్చుంది. ఇప్పుడు కూడా అదే సీన్ ను త్రిష రిపీట్ చేసింది.

త్రిష స్వాతంత్ర వేడుకలకు రావడం.. విజయ్ జాతీయ జెండాను ఎగరవేసి.. ముఖ్యమంత్రి హోదాలో ప్రసంగిస్తుంటే ప్రతిక్షణాన్ని త్రిష ఆస్వాదించడం ఆ వీడియోలో కనిపించింది. దీంతో త్రిష, విజయ్ విడిపోలేదని.. కలిసి ఉంటున్నారని అర్థమయిపోయింది. అలాంటప్పుడు సంగీత విడాకుల కేసు ఎందుకు వెనక్కి తీసుకుంది.. తెర వెనుక ఎవరు ఉన్నారు అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి మొదలైంది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన చర్చల్లో సంగీత విడాకుల కేసు వెనక్కి తీసుకున్నప్పటికీ.. విజయ్ మాత్రం త్రిషతో దూరంగా ఉండడానికి ఒప్పుకోలేదని తాజా ఉదంతం ద్వారా తెలుస్తోంది..

స్వాతంత్ర వేడుకలు జరిగే ప్రాంతానికి త్రిష రావడంతో తమిళం మీడియా ఫోకస్ మొత్తం ఆమె మీదనే ఉంది. జాతీయ మీడియా కూడా త్రిష కి విపరీతమైన కవరేజీ ఇచ్చింది. ఆమె వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నిన్నటిదాకా త్రిష మీడియాలో అంతగా కనిపించలేదు. ఎప్పుడైతే స్వాతంత్ర వేడుకలకు హాజరైందో అప్పుడే ఆమె గురించి మళ్ళీ చర్చ మొదలైంది. ఎంతైనా మీడియా అటెన్షన్ పొందడంలో త్రిషకి తెలిసినంతగా మరి ఎవరికి తెలియదని.. రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper