YS Jagan Mohan Reddy: ఏపీ రాజకీయాలు నిత్యం భాస్వరం లాగా మండుతూనే ఉంటాయి. ఎన్నికలు ఉన్నా సరే.. లేకపోయినా సరే ఏపీ రాజకీయాలు భగభగలాడుతూనే ఉంటాయి. అలా ఎందుకు ఉంటుందో.. ఎందుకు అలా జరుగుతుందో చివరికి రాజకీయాలు చేసే నాయకులు కూడా చెప్పలేరు.
2024 లో జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ జస్ట్ 11 సీట్లు మాత్రమే సాధించింది. అంతకుముందు ఎన్నికల్లో సాధించిన సీట్లతో పోల్చి చూస్తే ఈ ఫిగర్ చాలా చాలా చాలా తక్కువ. పైగా జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను చంద్రబాబు తవ్వుతున్నాడు. లోకేష్ పదేపదే గెలుకుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఉరుముతున్నాడు. ఇప్పటికే అరెస్టులు జరిగిపోతున్నాయి. స్థూలంగా చెప్పాలంటే జగన్ పీఠం కిందికి నీళ్లు రావడం కాదు.. జగన్ పునాదులే పూర్తిగా కదిలిపోతున్నాయి. ఇలాంటి అప్పుడు జగన్ కు ప్రాపర్ సలహాలు ఇచ్చే వాళ్ళు కావాలి. పార్టీని ప్రాపర్ వే లో తీసుకెళ్లేవారు కావాలి. 2019లో ప్రశాంత్ కిషోర్ జగన్ కోసం పనిచేశాడు. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది.
ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఉన్న పార్టీలకి ఎవరో ఒకరు స్ట్రాటజిస్ట్ పనిచేస్తూనే ఉండాలి. వాస్తవానికి స్ట్రాటజిస్ట్ లు అధికారాన్ని తీసుకురాగలుగుతారా.. ప్రజల ఆలోచన విధానాన్ని మార్చగలుగుతారా అనేది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. ప్రశాంత్ కిషోర్ కేవలం సలహాల ద్వారానే కోటకు కోట్లు సంపాదించాడు. తన టీం లో పనిచేసిన వారు సొంతంగా సంస్థలు పెట్టుకున్నారు. అలా ప్రశాంత్ కిషోర్ టీం లో పనిచేసిన వ్యక్తి పేరు కపిల్ సాహూ. వాస్తవానికి తన పార్టీ కోసం పనిచేసే వ్యూహకర్తలను తెర ముందుకు తీసుకొచ్చి పరిచయం చేస్తాడు జగన్. కానీ కపిల్ విషయంలో మాత్రం ఆ పని చేయలేదు. కపిల్ తమిళనాడులో టీవీ కే విజయ్ కి పనిచేశాడు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ లార్జెస్ట్ సీట్లు సాధించి.. అతిపెద్ద పార్టీకి అవతరించింది. కాంగ్రెస్.. వామపక్షాలు.. ఇతర పార్టీల సహకారం తీసుకొని మొత్తానికి అధికారాన్ని సొంతం చేసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
టీవీ కే విజయ్ కి పనిచేసిన అనుభవం.. తనలాంటి ఆలోచనలు ఉండడంతో జగన్ కపిల్ కు రెడ్ కార్పెట్ వేశాడు. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ తర్వాత జగన్ బృందంలో రుషి సింగ్ అనే వ్యక్తి చేరాడు. ఇతడి వల్లే జగన్ వై నాట్ 175 అనే నినాదాన్ని ఎత్తుకున్నాడని.. చివరికి అడ్డంగా బోల్తాపడ్డాడని రాజకీయ వర్గాల్లో అప్పట్లో చర్చ నడిచింది. రుషి సింగి వెళ్లిపోయిన తర్వాత అప్పట్లో ఆళ్ల మోహన్ సాయి దత్ అనే వ్యక్తిని జగన్ తన టీమ్ లోకి తీసుకున్నాడు. ఆయన వల్ల కూడా పెద్దగా ఉపయోగ లేకపోవడంతో జగన్ పక్కన పెట్టాడు. టీవీ కే కార్యకలాపాలు చూసి .. జగన్ ఫిదా అయిపోయాడు. కపిల్ కు అవకాశం ఇచ్చాడు. అయితే కపిల్ తో జరిగిన చర్చల్లో జగన్ సోదరుడు వైయస్ అనిల్ కుమార్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. పైగా అనిల్ కుమార్ రెడ్డికి.. విజయ్ కి చాలా దగ్గరి స్నేహం ఉంది. మొత్తంగా అనిల్ ద్వారా కపిల్ సాహూ జగన్ కోటరిలో చేరాడు.
కపిల్ సాహూ లు చెన్నైలో.. బెంగళూరులో కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ వర్క్ మొదలెందని తెలుస్తోంది. విజయవాడలోని శివారు ప్రాంతంలో ఆఫీస్ కూడా మొదలుపెట్టారని సమాచారం. క్రితం ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే రావడంతో జగన్ కూడా కొద్దిరోజుల పాటు సైలెంట్ అయిపోయాడు. రాజకీయంగా వైరాగ్యస్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. తన ప్రతి సభకు జనం బాగా వచ్చేలా చూసుకుంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో అధికారం సొంతం చేసుకుంటామని సంకేతాలు ఇస్తున్నాడు.. కానీ ఇక్కడ జగన్ చాలా విషయాలను గుర్తుంచుకోవాలి. పార్టీ పునర్నిర్మాణం కింది స్థాయి నుంచి జరగాలి. నిజమైన కార్యకర్తలకు గుర్తింపు దక్కాలి. ప్రోత్సాహం కూడా లభించాలి. గతంలో తన పరిపాలన సంబంధించిన తప్పులను సమీక్షించాలి. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సిద్దిపేట కచ్చితంగా జరగాలి. ముఖ్యంగా నేరస్థులను జగన్ పరామర్శించకూడదు. అటువంటి వ్యక్తులకు పార్టీలో చోటు కల్పించకూడదు. చివరగా వ్యూహకర్తలు ఐడియాలు మాత్రమే ఇస్తారు. వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సింది రాజకీయ నాయకులే. ఈ విషయాన్ని జగన్ గుర్తుంచుకొని అడుగులు వేస్తే మంచిది. లేకపోతే 2024 రిజల్ట్స్ రిపీట్ అవుతాయి.