spot_img
Homeజాతీయ వార్తలుచైనాకు భారత్‌ చెక్‌

చైనాకు భారత్‌ చెక్‌

India Eye on China Area 2
చైనాను ఎన్నిసార్లు తిప్పికొట్టినా తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. వాస్తవాధీన రేఖ వెంబడి ఇంకా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈసారి చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్‌ వ్యూహాత్మకంగా కదులుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొంత భూమిని భారత్‌ దేశ రక్షమంత్రిత్వశాఖ సేకరించింది. చైనా చొరబాట్లను నిరోధించేందుకు ఈ భూమిలో మిలటరీ గారిసన్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఎల్‌ఏసీ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న యోర్ని-2 గ్రామంలోని భూమిని రక్షణ మంత్రిత్వశాఖ సేకరించింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని వెస్ట్‌ సియాంగ్‌ జిల్లాలో ఉంది ఈ గ్రామం. ఇక్కడ సేకరించిన భూమిలో మిలటరీ గారిసన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. సామ్రాజ్యవాద కాంక్షతో యథేచ్ఛగా వ్యవహరిస్తున్న చైనాను దీటుగా తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం ఈ చర్యకు దిగింది. న్యింగ్‌చిలో మౌలిక సదుపాయాలను చైనా పెంచుతోంది. చైనాను ఎదుర్కొనడానికి భారత్‌ సర్కార్‌ ఈ భూమిని సేకరించింది.

గ్రామసభ సమావేశం అవసరం లేకుండా రక్షణ, రైల్వేలు, కమ్యూనికేషన్ల కోసం భూమిని సేకరించే అధికారం భూ సేకరణ పునరావాసం, పునః పరిష్కారంలో న్యాయమైన నష్టపరిహారం, పారదర్శకత చట్టం, 2013 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ భూమిని సేకరించేందుకు సముచిత అధికార వ్యవస్థగా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంటూ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ చట్టం ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper