Liquor sales: దున్నపోతు ఈనిందంటే దొడ్లో కట్టేయమన్నాడట వెనకటికి ఒకడు. ఇప్పుడు మనదేశంలో మీడియా పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా .. విషయ పరిజ్ఞానం లేకుండా వార్తలు రాయడం.. ప్రజలను తప్పుదారి పట్టించడం ఇటీవల వివిధ మాధ్యమాలు బాగా వంటపట్టించుకున్నాయి.
మనదేశంలో చాలా రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు సాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి కొన్ని రకాల మద్యం బ్రాండ్లను మద్యం ప్రియులు తాగుతూ ఉంటారు. అయితే కొద్ది రోజులుగా మనదేశంలో మద్యం ప్రియులు ఇష్టపడే బ్రాండ్లు దొరకవని.. ఆ మద్యం ఇకపై లభించదని.. కంపెనీలకు షాక్ తగిలిందని.. లిక్కర్ అమ్మకాల మీద నిషేధం విధించారని.. ఇలా మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఇలాంటి వార్తలు రాస్తున్నప్పుడు మీడియా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మనదేశంలో ఉన్న ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (fssai) కొన్ని నిబంధనలను విధించింది. ఆ నిబంధనల ఆధారంగానే ఉత్పత్తులు తయారు చేయాల్సి ఉంటుంది. కానీ మన దేశం మార్కెట్లో కొన్ని ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన లిక్కర్ ఉత్పత్తులు.. అమ్మకాలకి సంబంధించి ప్రభుత్వం నిషేధం విధించింది. వాస్తవానికి ఈ నిషేధం వెనక బలమైన కారణాలు ఉన్నాయి. మీడియా ఈ కారణాలు చెప్పకుండా.. అడ్డగోలుగా రాసింది. మద్యం మొత్తం బ్యాన్ అవుతుందని చెప్పింది. ఒకవేళ మద్యం పై నిషేధం విధిస్తే ప్రభుత్వాలు ఎలా మనుగడ సాగిస్తాయి.. అన్ని ప్రభుత్వాలకు మద్యం ద్వారానే కదా ఆదాయం వచ్చేది.. అలాంటప్పుడు మద్యం వ్యాపారం ఆగిపోతే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు దారుణంగా దిగజారి పోతాయి.
మద్యాన్ని సహజమైన విధానంలో తయారు చేయాలి. మాల్ట్.. మొలాసిస్ లేదా ద్రాక్షను ఉపయోగించాలి. ఒకవేళ అవకాశం ఉంటే పులియ పెట్టాలి.. దీనిద్వారా సహజమైన వాసన.. రుచి లభిస్తుంది. కానీ మద్యాన్ని తయారీదారులు బయటినుంచి కృత్రిమ విధానంలో విస్కీ లేదా రం ఫ్లేవర్లను కలుపుతున్నారు. ఇది ఇటీవల కేంద్రం నిర్వహించిన పరీక్షల్లో బయటపడింది.. ఉదాహరణకు ఓ బ్రాండ్ కి సంబంధించిన రమ్ పై “ఏడు సంవత్సరాల క్రితం ఓల్డ్ బ్లండెడ్” అని ముద్రించారు. కానీ దేవుని పరీక్షిస్తే అందులో పాత రమ్ స్పిరిట్ ఐదు శాతం కంటే తక్కువ ఉందని తేలింది. మిగతాది ఫ్లేవర్ కలిపిన మామూలు స్పిరిట్ అని పరీక్షల్లో తెలియ వచ్చింది.
ఇది కస్టమర్లను మోసం చేయడమేనని ప్రభుత్వం భావించింది. కేంద్రం తీసుకొచ్చిన తాజా నిబంధనలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాత లేబులింగ్ సరుకు మీద మాత్రమే వర్తిస్తుంది. ఈ సంస్థలకు సంబంధించి మొత్తం ఉత్పత్తి మీద ఈ నిబంధనలు వర్తించవు. కంపెనీల ఉత్పత్తికి ప్రస్తుతం ఎటువంటి అంతరాయం లేదు. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా కొత్త సరుకులు మార్కెట్లోకి విడుదల చేయాలి.