Homeఅంతర్జాతీయంIndia US Tariff : భారత్ పై 100% టారిఫ్.. కొంప ముంచిన ట్రంప్

India US Tariff : భారత్ పై 100% టారిఫ్.. కొంప ముంచిన ట్రంప్

India US Tariff : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఏడాది పాలనంతా అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమేయడం, విదేశాల నుంచి అమెరికా చేసుకుంటున్న దిగుమతులపై సంకాలు విధించేందుకే గడిచిపోయింది. రెండో ఏడాది ఇరాన్‌ కొరివితో తలగొక్కున్న ట్రంప్‌ ఇప్పుడు ఆ యుద్ధం నుంచి బయట పడలేక, యుద్ధం కొనసాగించలేక తంటాలు పడుతున్నాడు. యుద్ధం కారణంగా అమెరికా ఆర్థికంగా దెబ్బతిన్నది. ఇదే సమయంలో అమెరికా సుప్రీం కోర్టు ట్రంప్‌ విధించిన సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని […]

India US Tariff : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఏడాది పాలనంతా అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమేయడం, విదేశాల నుంచి అమెరికా చేసుకుంటున్న దిగుమతులపై సంకాలు విధించేందుకే గడిచిపోయింది. రెండో ఏడాది ఇరాన్‌ కొరివితో తలగొక్కున్న ట్రంప్‌ ఇప్పుడు ఆ యుద్ధం నుంచి బయట పడలేక, యుద్ధం కొనసాగించలేక తంటాలు పడుతున్నాడు. యుద్ధం కారణంగా అమెరికా ఆర్థికంగా దెబ్బతిన్నది. ఇదే సమయంలో అమెరికా సుప్రీం కోర్టు ట్రంప్‌ విధించిన సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు వసూలు చేసిన సుంకాక్షల తిరిగి చెల్లించాలని ఆదేశించింది. దీంతో మరో రూ.10 లక్షల కోట్ల అమెరికా తిరిగి చెల్లిస్తోంది. ఈ తరుణంలో తాజాగా అమెరికా సెనేట్‌ 86–11 ఓట్లతో రష్యా, ఇరాన్‌పై ఆంక్షల బిల్లును ఆమోదించింది. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచే వ్యూహం. ఈ బిల్లు రష్యా చమురు, గ్యాస్‌ దిగుమతి చేసుకునే టాప్‌ ఐదు దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇస్తుంది. చైనా తర్వాత భారత్‌ రష్యా క్రూడ్‌ ఆయిల్‌ రెండో అతిపెద్ద కొనుగోలుదారు. ఫలితంగా భారత్‌కు 100 శాతం సుంకాల ముప్పు పొంచి ఉంది.

బిల్లులో ముఖ్య అంశాలు
ఈ చట్టం రష్యా అధికారులు, ఒలిగార్కులు, షాడో ఫ్లీట్‌పై ఆంక్షలు విధించడంతోపాటు, రష్యా ఎనర్జీ కొనుగోలుదారులపై ద్వితీయ సుంకాలు విధించే అవకాశం కల్పిస్తుంది. టాప్‌ ఐదు కొనుగోలుదారుల్లో చైనా, భారత్, అజర్‌బైజాన్, హంగేరీ, స్లోవేకియా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో అధ్యక్షుడికి మినహాయింపు అధికారం కూడా ఉంది. దీంతో సుంకాలు తప్పనిసరిగా విధించాల్సిన అవసరం లేదు. ఇక ఇరాన్‌పై ఆంక్షలను మరో ఐదేళ్లు పొడిగించడం కూడా ఇందులో ఉంది.

భారత్‌పై ప్రభావం..
భారత్‌ ప్రస్తుతం రష్యా చమురుపై గణనీయంగా ఆధారపడి ఉంది. ఇటీవలి నెలల్లో (2026 జూన్‌–జూలై) రష్యా క్రూడ్‌ భారత్‌ మొత్తం చమురు దిగుమతుల్లో 50 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. రోజుకు సుమారు 2.6 నుంచి 2.8 మిలియన్‌ బ్యారెల్స్‌ స్థాయిలో దిగుమతులు జరుగుతున్నాయి. రష్యా మొత్తం చమురు ఎగుమతుల్లో భారత్‌ వాటా 36 నుంచి 38 శాతం మధ్య ఉంది. ఇది భారత్‌ ఇంధన భద్రతకు, దిగుమతి బిల్లు తగ్గించుకోవడానికి, ద్రవ్యోల్బణ నియంత్రణకు సహాయపడుతోంది.

100 శాతం సుంకాలు విధిస్తే..
ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత వంద శాతం సుంకాలు విధిస్తే భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై అదనపు సుంకాలు పడవచ్చు. ఫార్మా, ఇంజినీరింగ్‌ వస్తువులు, టెక్స్‌టైల్స్, కెమికల్స్, ఆటో కాంపోనెంట్స్‌ వంటి రంగాలు ప్రభావితం కావచ్చు. ఇప్పటికే గతంలో రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా కొన్ని సుంకాలు ఉన్న నేపథ్యంలో ఇది అదనపు భారం అవుతుంది. భారత్‌ రష్యా చమురు తగ్గించాల్సి వస్తే ప్రత్యామ్నాయ మూలాల నుంచి కొనుగోలు పెరుగుతుంది. ఇది దిగుమతి ఖర్చులు పెంచి, దేశంలో పెట్రోల్‌–డీజిల్‌ ధరలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. దీంతో భారత్‌–అమెరికా వాణిజ్య చర్చలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై అనిశ్చితి పెరుగుతుంది. అయితే అధ్యక్షుడికి వైవ్‌ అధికారం ఉండటంతో ఇండో–పసిఫిక్‌ సహకారం, చైనా వ్యతిరేక వ్యూహం వంటి కారణాలతో మినహాయింపు ఇచ్చే అవకాశం కూడా ఉంది.

అంతర్జాతీయ పరిణామాలు
భారత్‌పై సుంకాలు విధించినా లేదా వైవ్‌ ఇచ్చినా, ఇది గ్లోబల్‌ ఎనర్జీ మార్కెట్లలో మార్పులు తీసుకురావచ్చు. రష్యా ఆదాయం తగ్గేలా ఒత్తిడి పెరుగుతుంది. అయితే భారత్‌ వంటి పెద్ద మార్కెట్లు వెంటనే మార్పులు చేయకపోతే ప్రభావం పరిమితం కావచ్చు. భారత్‌ ఇప్పటికే సరఫరా మూలాలను వైవిధ్యపరచుకుంటూ ఉంది కాబట్టి, పూర్తి ఆధారపడటం తగ్గించుకునే అవకాశం ఉంది.

మొత్తంగా, ఈ బిల్లు భారత్‌కు తక్షణ ప్రమాదం కంటే దీర్ఘకాలిక అనిశ్చితిని సృష్టిస్తుంది. అధ్యక్షుడి నిర్ణయం, ప్రతినిధుల సభ ఆమోదం, భారత్‌–అమెరికా ద్వైపాక్షిక చర్చలు దీని తీవ్రతను నిర్ణయిస్తాయి. భారత్‌ తన ఇంధన భద్రతను కాపాడుకుంటూ, వాణిజ్య సంబంధాలను బ్యాలెన్స్‌ చేసుకోవాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper