Homeజాతీయ వార్తలుIndia China Border : ఇండియా, చైనా సైనికులు చేసిన పని వైరల్

India China Border : ఇండియా, చైనా సైనికులు చేసిన పని వైరల్

India China Border : అప్పట్లో గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది గుర్తుందా. నాటి ఘటనలో భారత్, చైనా సైనికుల మధ్య పరస్పరం ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో మన దేశానికి చెందిన కల్నల్ సంతోష్ చనిపోయాడు. ఈ ఘటన జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రతిసారి చైనా మన భూభాగాన్ని తమ దేశంలో ఉన్నట్టు చూపించేది. అంతర్జాతీయ వేదికలలో మనమీద విషం చిమ్మేది. మరోవైపు చైనా కుట్రలను మన దేశం […]

India China Border : అప్పట్లో గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది గుర్తుందా. నాటి ఘటనలో భారత్, చైనా సైనికుల మధ్య పరస్పరం ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో మన దేశానికి చెందిన కల్నల్ సంతోష్ చనిపోయాడు.

ఈ ఘటన జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రతిసారి చైనా మన భూభాగాన్ని తమ దేశంలో ఉన్నట్టు చూపించేది. అంతర్జాతీయ వేదికలలో మనమీద విషం చిమ్మేది. మరోవైపు చైనా కుట్రలను మన దేశం ఎప్పటికప్పుడు తిప్పికొట్టేది. సరిహద్దుల్లో సైన్యాన్ని భారీగా మోహరించడం మొదలుపెట్టింది. అంతేకాదు చైనా సరిహద్దుల్లో సాగునీటి ప్రాజెక్టులను.. ఇతర ప్రాజెక్టులను చేపడుతోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడి లాంటి చికెన్ నెక్ రహదారిని అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. తద్వారా చైనా కుట్రలకు చెక్ పెడుతోంది. ఈ ప్రాజెక్టుల మీద భారత ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు పెడుతోంది. ఈ ప్రాజెక్టుల వల్ల మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల ముఖచిత్రమే మారుతోంది.

ఇండియన్ ఆర్మీ అంటే చైనాకు మొదటి నుంచి కూడా కోపం. అందువల్లే ఇండియన్ ఆర్మీ కనిపిస్తే చాలు ఒంటి కాలు మీద లేస్తుంది. అయితే తాజాగా ఇండియన్ ఆర్మీ పట్ల చైనా సైనికులు ఒక రకమైన ఆరాధన భావాన్ని ప్రదర్శించారు. భారత సైనికులు కూడా అదే విధమైన ప్రేమను చూపించారు. రెండు దేశాలకు సంబంధించిన సైనికులు ఇలా కలిసిపోవడం.. పరస్పరం ఒకే కొండమీద కూర్చోవడం.. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడం నిజంగా చిత్రంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది.

లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కొండపై కొంతమంది చైనా సైనికులు.. భారత సైనికులు కూర్చున్నారు. అక్కడ హిందీ పాటలు వింటూ.. అక్కడి వాతావరణం ఆస్వాదించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో రేపుతున్నసంచలనం అంతా ఇంతా కాదు. దీనిపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. చైనా సైనికులు చిన్న పిల్లల మాదిరిగా ఉన్నారని.. అమ్మాయిల మాదిరిగా సున్నితంగా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మన సైనికులు మాత్రం ఆరడుగుల ఎత్తుతో.. ఆజాను బాహులు లాగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత రెండు దేశాలకు సంబంధించిన సైనికులు ఇలా కలుసుకోవడం.. పరస్పరం పాటలు వింటూ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడం ఆశ్చర్యంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper