ప్రజల మంచి గురించి 5శాతం ఆలోచించే చంద్రబాబు…95 శాతం తన ఎదుగుదల, పార్టీ పటిష్టత గురించి ఆలోచిస్తాడు. ఆవగింజంత సాయం చేసి దానికి తాటి కాయంత ప్రచారం కోరుకుంటారు. ప్రచార ఆర్భాటం కోసం వందల కోట్లు ఖర్చుబెట్టే ఘనుడు. సగం కూడా పూర్తికానీ, పోలవరం ప్రాజెక్ట్ నేను కట్టేసేశాను… చూడండి అని బస్సులతో ప్రజల్ని తరలించిన ముఖ్యమంత్రి చరిత్రలో మరొకడు కానరాడేమో. అభివృద్ధి, సంక్షేమం సంగతి ఎలా ఉన్నా…అనుకూల పత్రికల ద్వారా భజన చేయించుకోవడం ఏళ్లుగా అలవాటు పడిన వ్యవహారం. కుటిల రాజకీయాలలో దార్శనికుడు అయిన ఈ మేధావి, దశాబ్దాలుగా అనుకూల మీడియా రాతలతో ప్రజల్ని మభ్య పెడుతూ వస్తున్నాడు. మంచి చేయకపోయినా, మీడియా సపోర్ట్ తో ఎదగవచ్చనే నీతి తెలిసిన మొదటి రాజకీయ నాయకుడు బహుశా చంద్రబాబు నాయుడే అయ్యుండాలి.
సదరు పత్రికాధిపతులకు ఇవ్వాల్సింది ఇస్తుంటే.. ఈయనకు కావలసింది రాస్తూ ఉంటారు. అధికారంలో ఉంటే బాబు భజన, ప్రతిపక్షంలో ఉంటే అవాస్తవాలు వడ్డించడం సదరు పత్రికల ఎజెండా ఉంటుంది. గత ఏడాదిగా మనం చూస్తున్నది అదే. నిరాధారణమైన రాతలతో రెచ్చిపోతుంటే చేసేదేమి లేక, న్యాయ పోరాటానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో నాలుగేళ్లలో ఎన్నికలు ఉండగా ఎలాగైనా అధికార పార్టీ అధినేతపై ప్రజల్లో అసమర్థుడు, అవినీతి పరుడు అనే అభిప్రాయం తేవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు బాబు పాలనాదక్షుడని, ఆయన కొడుకు లోకేష్ అమాయకంగా కనిపించే అపర మేధావి అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. లోకేష్ పెట్టిన వంటలు మెచ్చి రాష్ట్రంలో పరిశ్రమలు పెడతాం అని ముందుకు వచ్చిన పెట్టుబడిదారులు… అని రాసిన ఘనత ఆ పత్రికల సొంతం.
ఇక మీడియా సహకారంతోనే వచ్చే ఎన్నికలో గెలవాలని బాబు, లోకేష్ టార్గెట్ పెట్టుకున్నారు. సోషల్ మీడియా, వెబ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియాపై విపరీతంగా పెట్టుబడి పెడుతున్నారు. లోకేష్ ఆధ్వర్యంలో జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చెయ్యడానికి, బాబు,లోకేష్ ఇమేజ్ పైకెత్తడానికి ప్రత్యేక విభాగాలు ఏర్పడ్డాయి. విజయవాడ, గుంటూరు మరియు హైదరాబాద్ వేదికలుగా పనిచేసే ఈ టీంలు ఇప్పటికే అనేక వెబ్సైట్స్ స్థాపించి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. సోషల్ మీడియా విభాగాలు జగన్ వ్యతిరేక పోస్ట్స్ మరియు నెగెటివ్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేస్తున్నాయి. ఇక ఎప్పటి నుండో పాతుకుపోయిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ఉండనే ఉంది. ఇలా మీడియా రాతల భ్రమలో పడేసి, ప్రజల ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. మరి వీరి వ్యూహాలను జగన్ ఎలా తిప్పికొడతాడో చూడాలి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Cbn and lokesh plans to check jagan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com