HomeNewsJogi Ramesh : మాజీ మంత్రి కుమారుడికి పెళ్లి ఇష్టం లేదా.. సోషల్ మీడియాలో వైరల్!

Jogi Ramesh : మాజీ మంత్రి కుమారుడికి పెళ్లి ఇష్టం లేదా.. సోషల్ మీడియాలో వైరల్!

Jogi Ramesh : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై సొంత కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కుటుంబ వ్యవహారం కాస్త రచ్చకు దారితీసింది. ఆ కుటుంబ సభ్యులు 11 మందిపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. ఒకవైపు ఈ కేసు విచారణ కొనసాగుతుండగా.. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిగత వ్యవహారం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఆ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన […]

Jogi Ramesh : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై సొంత కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ కుటుంబ వ్యవహారం కాస్త రచ్చకు దారితీసింది. ఆ కుటుంబ సభ్యులు 11 మందిపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు. ఒకవైపు ఈ కేసు విచారణ కొనసాగుతుండగా.. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిగత వ్యవహారం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఆ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడికి ఇష్టం లేని పెళ్లి చేశారని వెలుగు చూస్తోంది ఆ వీడియోలో. ఏకంగా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అనవసరంగా తనను ఒత్తిడి చేసి పెళ్లి చేయించారని ఆయన మాట్లాడుతున్న అంశాలకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.

* కోడలు ఫిర్యాదు..
మొన్న మధ్యన మాజీమంత్రి జోగి రమేష్ కుటుంబం పై ఆయన కోడలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన అత్తవారు ఇంట తనకు మానసికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. తీవ్రంగా హింసిస్తున్నారని.. గృహ హింసకు పాల్పడ్డారని.. ఒకటి రెండుసార్లు హత్య ప్రయత్నం చేశారని ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జోగి రమేష్ మాజీ మంత్రి కావడం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కావడం తీవ్ర చర్చకు దారితీసింది. పైగా ఆమె తెలంగాణకు చెందిన యువతి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ ఘటన. అయితే దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణించారు జోగి రమేష్ కుటుంబ సభ్యులు. కానీ గత కొంతకాలంగా జరుగుతున్న వ్యవహారాలతోనే బాధితురాలు బయటకు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కేవలం జోగి రమేష్ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు సమీప బంధువులు 11 మంది తనపై వేధింపులకు గురి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

*:వీడియో బయటకు..
అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి నిందితుల్లో ఒకడైన జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. కుటుంబ సభ్యుల బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించారని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైన తర్వాత జోగి రమేష్ కోడలి కుటుంబ సభ్యులకు జరిగిన చర్చలు బయటకు వచ్చాయి. అసలు తనకు ఈ వివాహం ఇష్టం లేదని.. అర్ధరాత్రి దాటిన తర్వాత వేకువ జాము వరకు తనకు వైట్ వాష్ చేశారని.. బలవంతంగా ఒప్పించారంటూ జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తండ్రి పై తిరగబడుతున్న వీడియోలకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.. అయితే ఆ కుటుంబంలో అంతర్గతంగా జరిగిన చర్చలు బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే సొంత కుటుంబ సభ్యులే ఈ వీడియో లిఫ్ట్ చేశారని అర్థం అవుతోంది. కాగా ఈ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper