Homeఆంధ్రప్రదేశ్‌Botsa Satyanarayana: బొత్స రిటైర్ మెంట్.. ఆయన వారసుడు ఎవరు?

Botsa Satyanarayana: బొత్స రిటైర్ మెంట్.. ఆయన వారసుడు ఎవరు?

Botsa Satyanarayana: సీనియర్ మంత్రి బొత్స అనారోగ్యం బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయినట్లు తెలుస్తోంది. కనీసం రెండు నెలల పాటు ఆయనకి విశ్రాంతి అవసరం ఉంటుంది. మరోవైపు చూస్తే ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన బరిలో దిగుతారా? లేదా? అన్న చర్చ ప్రారంభమైంది. తాజాగా ఆయన భార్యతో పాటు కుమారుడు పేరు బలంగా వినిపిస్తోంది. ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ హై కమాండ్ నుంచి భిన్న సంకేతాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ రాణి రెండుసార్లు ఎంపీగా ఉన్నారు. ఆమె ఈసారి విజయనగరం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆయనకు అసెంబ్లీకి పంపించి.. ఎంపీ సీటును బొత్స కుటుంబీకులకు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. అయితే బెల్లాన చంద్రశేఖర్ ను ఎక్కడ సర్దుబాటు చేస్తారన్నది అంతు చిక్కని ప్రశ్న. ఆయన చీపురుపల్లి అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. అది బొత్స సత్యనారాయణ సిట్టింగ్ స్థానం. అది వదులుకునేందుకు ఆయన సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇక బెల్లానకు రెండో ఆప్షన్ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం. కానీ అక్కడికి వెళ్లేందుకు బెల్లాన చంద్రశేఖర్ ససే మీరా అంటున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు బొత్స కుమారుడు డాక్టర్ సందీప్ ఎమ్మెల్యేగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. చీపురుపల్లి నుంచి తన కుమారుడికి, విజయనగరం ఎంపీ స్థానం నుంచి తన భార్యకు టిక్కెట్ ఇవ్వాలని బొత్స సత్యనారాయణ కోరుతున్నట్లు తెలుస్తోంది. అలా అయితే జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాల్లో వైసీపీకి గెలిపించుకుని వస్తానని… పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే తనకు రాజ్యసభ పదవి ఇవ్వాలని మెలిక పెట్టినట్లు సమాచారం. అయితే హై కమాండ్ మాత్రం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో ఒక్కటే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బొత్స సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సమీప బంధువు బొడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ఇన్ని పదవులు ఉండగా మరో పదవి ఇవ్వడానికి జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా బొత్స అనారోగ్యానికి గురికావడంతో.. జిల్లాలో పార్టీ పగ్గాలు చూస్తున్న ఆయన మేనల్లుడు శ్రీనివాసరావుకు హై కమాండ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన సైతం వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగానో.. ఎంపీ గానో పోటీ చేయాలని చూస్తున్నారు. అటు బొత్స కుటుంబంలో సైతం కొన్ని రకాలుగా అరమరికలు వచ్చాయని టాక్ నడుస్తోంది. చాలా రకాల విభేదాలు చుట్టుముట్టాయని.. ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు సైతం ప్రచారం జరిగింది. ఈ పరిణామాలను ఆసక్తిగా చూస్తున్న వైసీపీ హై కమాండ్ కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బొత్స దూకుడుకు కళ్లెం వేయడానికి.. ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. మరి ఎన్నికల ముంగిట ఏ పరిణామాలు జరుగుతాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper