Anchor Pradeep : బుల్లితెర పై యాంకర్ ప్రదీప్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన డేట్స్ కోసం బడా సంస్థలు క్యూలు కడుతుంటారు. మధ్యలో కొన్ని రోజులు సినిమాల్లో హీరోగా నటిస్తుండడంతో బుల్లితెర కి బ్రేక్ ఇచ్చిన ప్రదీప్ , ఇప్పుడు రీ ఎంట్రీ లో వరుస షోస్ తో దుమ్ము లేపుతున్నాడు. రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో ఈయన హోస్ట్ గా వ్యవహరించిన ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇప్పుడు ఆయన ప్రతీ ఆదివారం ఈటీవీ లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ వారం టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని రీసెంట్ గానే విడుదల చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ ప్రోమో చివర్లో నైనిషా రాయ్ అనే సీరియల్ నటి ప్రదీప్ కి ప్రపోజ్ చేసిన సన్నివేశం అందరినీ షాక్ కి గురి చేసింది. ఒక మంచి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో ఎంట్రీ ఇచ్చిన నైనిషా రాయ్ , తర్వాత ప్రదీప్ తో మాట్లాడుతూ ‘నాకు 13 ఏళ్ళ క్రితం ఒక అబ్బాయి మీద క్రష్ ఏర్పడింది. ఆ అబ్బాయికి ఇప్పుడొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అది చెప్పే ముందు ఒకటి చూపించాలని అనుకుంటున్నాను’ అంటూ తన అరచేతిపై వేయించుకున్న టాటూ ని చూపిస్తుంది. ఆ టాటూ ‘దీప్’ అనే పేరుతో ఉంటుంది. ఆ పేరు మరెవరిదో కాదు, ‘ప్రదీప్’ దే అని అంటుంది నైనిషా రాయ్. దీంతో ఒక్కసారిగా ప్రదీప్ షాక్ కి గురి అవుతాడు. ఆ షో కి వచ్చిన మిగిలిన సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోతూ అలా చూస్తుండిపోతారు. ఏమి మాట్లాడుతున్నావ్ అసలు అని ప్రదీప్ అడగ్గా , అందుకు నైనిషా నిజం మాట్లాడుతున్నాను అని అంటుంది.
‘ఇప్పటికీ కూడా మీ ఎదురుగా నిలబడుతుంటే నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ప్రోమో ముగుస్తుంది, ఆమె నిజంగా ప్రదీప్ కి ప్రపోజ్ చేసిందా?, లేదంటే ప్రాంకా ? అనేది తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే. ఇక నైనిషా రాయ్ విషయానికి వస్తే, ఈమె స్టార్ మా ఛానల్ లో ‘బ్రహ్మముడి’ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇందులో హీరోయిన్ కి చెల్లిగా , టామ్ బాయ్ క్యారెక్టర్ లో అదరగొట్టేసింది నైనిషా రాయ్. అంతకు ముందు ఈమె అనేక సీరియల్స్ లో విలన్ గా నటిస్తూ వచ్చింది.