Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: జగన్ కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత.. వీడియో వైరల్!

YS Jagan: జగన్ కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత.. వీడియో వైరల్!

YS Jagan: ఎద్దు ఈనిందా.. దూడను కట్టేయండి అన్నట్టు ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి. రాష్ట్రంలో ఏది జరిగిన అది కూటమి ఖాతాలో వేయడం ఆయనకు అలవాటైన విద్య. ఒకవేళ మంచి కార్యక్రమం అయితే అది తన క్రెడిట్ గా చెప్పుకుంటారు. చెడు కార్యక్రమం అయితే మాత్రం కూటమి ఖాతాలో వేస్తారు. అటువంటి ప్రయత్నమే చేశారు తాజాగా పల్నాడు జిల్లాలో వైసీపీ నేత హత్య విషయంలో. పల్నాడు జిల్లాలో వైసీపీ యువనేత దారుణ హత్యకు […]

YS Jagan: ఎద్దు ఈనిందా.. దూడను కట్టేయండి అన్నట్టు ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి. రాష్ట్రంలో ఏది జరిగిన అది కూటమి ఖాతాలో వేయడం ఆయనకు అలవాటైన విద్య. ఒకవేళ మంచి కార్యక్రమం అయితే అది తన క్రెడిట్ గా చెప్పుకుంటారు. చెడు కార్యక్రమం అయితే మాత్రం కూటమి ఖాతాలో వేస్తారు. అటువంటి ప్రయత్నమే చేశారు తాజాగా పల్నాడు జిల్లాలో వైసీపీ నేత హత్య విషయంలో. పల్నాడు జిల్లాలో వైసీపీ యువనేత దారుణ హత్యకు గురయ్యారు. ఆయన తండ్రి వైసీపీ హయాంలో జడ్పిటిసి గా పని చేశారు. అయితే తండ్రిని పరామర్శించే క్రమంలో అక్కడ టిడిపి ఎమ్మెల్యే పాత్ర ఉందా అంటూ ప్రశ్నించారు. అయితే సొంతవారే ఇలా చేశారు అంటూ.. వైసీపీలో ఉన్న వర్గ పోరు వల్లే ఈ హత్య జరిగిందని అర్థం అవుతోంది. కానీ జగన్ మోహన్ రెడ్డి పదేపదే టిడిపి వాళ్ళ హస్తం ఉందా? స్థానిక ఎమ్మెల్యే హస్తము ఉందా? అంటూ ప్రశ్నించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

* పల్నాడు జిల్లాలో ఘటన..
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన నేత నవులూరి చెన్నారెడ్డి అనే యువకుడు హత్యకు గురయ్యాడు. నాలుగు రోజుల కిందట బైక్ పై మాచర్ల నుంచి రెంటాలకు ఒంటరిగా బయలుదేరాడు. దారి కాచిన ప్రత్యర్ధులు గొంతు కోసి హత్య చేశారు. ఈ హత్యకు వైసీపీలో ఉన్న వర్గ పోరే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు సైతం ఆదిశగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు గురజాల ప్రభుత్వాసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. చూసేందుకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డిలు వెళ్లారు. కానీ అక్కడ ఉన్న వారంతా వారిని అడ్డుకున్నారు. మీరే హత్య చేయించారంటూ ఆరోపణలు చేశారు.

* పదేపదే అడుగుతూ..
చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి గతంలో జడ్పిటిసి గా కూడా పనిచేశారు. అయితే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. ఈ క్రమంలో ఈ ఘటనలో టిడిపి ఎమ్మెల్యే పాత్ర ఉందా అంటూ జగన్ ప్రశ్నిస్తే.. అటువంటిదేమీ లేదని అన్నారు. సొంతవారే చంపించారంటూ చెప్పుకొచ్చారు. పదేపదే జగన్మోహన్ రెడ్డి అడిగిన అదే మాట చెప్పడంతో తిరిగి అధినేత నీళ్లు నమలాల్సి వచ్చింది. ఎలా ఓదార్చాలో తెలియక సతమత మైనట్లు ఆ సంభాషణలో కనిపించింది. రాష్ట్రంలో అయిన దానికి కాని దానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ తరహా రాజకీయం చేస్తోందో దీన్ని బట్టి తెలిసిపోతోందని కూటమి పార్టీల శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by 123Nellore (@123nellore)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper