Homeఎంటర్టైన్మెంట్Jabardasth Appa Rao : ఆ జబర్దస్త్ కమెడియన్ ప్రభాస్ కి గురువు.. ఎవరికీ తెలియని...

Jabardasth Appa Rao : ఆ జబర్దస్త్ కమెడియన్ ప్రభాస్ కి గురువు.. ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

Jabardasth Appa Rao : గత 12 ఏళ్ళ నుండి ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంత మంది టాలెంటెడ్ కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో తో తమ కెరీర్ ని మొదలు పెట్టినవాళ్లంతా , ఇప్పటికీ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి షో నుండి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కంటెస్టెంట్స్ లో ఒకరు అప్పారావు. ఈయన ఇండస్ట్రీ లో ఎప్పటి […]

Jabardasth Appa Rao : గత 12 ఏళ్ళ నుండి ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంత మంది టాలెంటెడ్ కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో తో తమ కెరీర్ ని మొదలు పెట్టినవాళ్లంతా , ఇప్పటికీ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి షో నుండి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కంటెస్టెంట్స్ లో ఒకరు అప్పారావు. ఈయన ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఉన్నాడు , కానీ గుర్తింపు లభించినది మాత్రం జబర్దస్త్ తోనే. రీసెంట్ గానే ఈయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఎవరికీ తెలియని ఎన్నో షాకింగ్ విషయాలను పంచుకున్నాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సినీ రంగం లో ప్రభాస్ కి ఈయనతో ఉన్నటువంటి అనుబంధం గురించి తెలుసుకొని నెటిజెన్స్ షాక్ కి గురయ్యారు.

ఆయన మాట్లాడుతూ ‘నేను సినీ ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోల సినిమాల్లో నటించాను. కానీ అనేక మందితో ఆ హడావుడిలో సంభాషణలు సాధ్యం అయ్యేవి కాదు , రావు రమేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి వారు మాత్రమే షాట్ బ్రేక్ లో నాతో మాట్లాడేవారు. రామ్ చరణ్ తో కలిసి నేను గోవిందుడు అందరివాడేలే సినిమాలో నటించాను. ఒక పాటలో ఆయన నా భుజం పై చెయ్యి వేసి కాసేపు మాట్లాడారు. కానీ దురదృష్టం కొద్దీ ఆ సినిమాలో నా సన్నివేశాలను ఎడిటింగ్ లో తొలగించారు. ప్రభాస్ నాకు హీరో అవ్వకముందు నుండే తెలుసు , నేను ఆరోజుల్లో మా గురువు గారు సత్యానంద్ వద్ద అసిస్టెంట్ గా పని చేసేవాడిని. ప్రభాస్ మా గురువు గారి దగ్గరే యాక్టింగ్ నేర్చుకున్నాడు’.

‘అనేక సందర్భాల్లో కోచింగ్ సమయం లో ప్రభాస్ కి ఎలా సన్నివేశాన్ని అర్థం చేసుకోవాలో స్వయంగా నేనే వివరించేవాడిని. చక్రం సినిమా మొదలయ్యే ముందు ప్రభాస్ గారికి మా గురువు కోచింగ్ ఇస్తూ ఉండేవాడు. ఆ సమయం లో ప్రభాస్ తో నేను గడిపిన క్షణాలను ఇప్పటికీ మర్చిపోలేను. ప్రభాస్ పెద్ద స్టార్ అయ్యాక బిల్లా మూవీ షూటింగ్ సమయం లో ఒకసారి , రాధే శ్యామ్ ట్రిమ్మింగ్ వర్క్ సమయం లో మరోసారి మాత్రమే కలిసాను. రెండవసారి నేను కలిసినప్పుడు సోఫా లో కూర్చున్న ప్రభాస్ పైకి లేచి, నన్ను కౌగలించుకొని , నాకోసం టీ , కాఫీ లు తెప్పించి , మా గురువు గారు సత్యానంద్ కి ఎలాంటి గౌరవం ఇస్తాడో నాకు కూడా అలాంటి గౌరవమే ఇచ్చాడు’ అంటూ అప్పారావు భావోద్వేగానికి గురయ్యాడు అప్పారావు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper