spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Ashwini: బిగ్ బాస్ అశ్వినికి పెళ్లి అయ్యిందా! ఆమె భర్త ఎవరు? ఏం...

Bigg Boss Ashwini: బిగ్ బాస్ అశ్వినికి పెళ్లి అయ్యిందా! ఆమె భర్త ఎవరు? ఏం చేస్తాడు?

Bigg Boss Ashwini: బిగ్ బాస్ హౌస్ లోకి ఐదు వారాల తరువాత వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది అశ్విని శ్రీ. కాగా తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంది. బిగ్ బాస్ కి రాకముందు అశ్విని గురించి ఎవరికీ అంతగా తెలియదు.అయితే అశ్విని .. మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో యాక్ట్ చేసింది. రష్మిక అక్కగా ట్రైన్ సీన్ లో కనిపించింది. అలాగే రవితేజ రాజా ది గ్రేట్ సినిమాలో ‘ ఎన్నియాలో ఎన్నియాలో ‘ లో సాంగ్ లో కనిపించింది.

హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన అశ్విని .. అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ఉండిపోయింది. కాగా అశ్విని హీరోయిన్ గా చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. కానీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అసలు రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలియదు. అమీర్ పేట లో, బీటెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ వంటి చిన్న సినిమాల్లో హీరోయిన్ గా అశ్విని నటించింది.

కాగా మిడిల్ క్లాస్ లో పుట్టిన అశ్విని శ్రీ, వరంగల్ నీట్ లో బీటెక్ పూర్తి చేసి జాబ్ చేద్దాం అనుకుందట. అయితే ఫ్రెండ్స్ అందరూ హీరోయిన్ లా ఉంటావంటూ చెప్పడంతో సినిమాల్లో ట్రై చేసేందుకు వచ్చిందని సమాచారం. పేరెంట్స్ ఒప్పుకోక పోయినా.. పట్టుబట్టి మరీ ఇండస్ట్రీ లోకి వచ్చిందట అశ్విని. ఇక ఇండస్ట్రీ లోకి వెళ్తే ఏం జరుగుతుందో అనే భయంతో .. ముందే అశ్విని పేరెంట్స్ 2013 లోనే పెళ్లి చేశారని తెలుస్తోంది.

కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అశ్విని భర్తతో కలిసి ఉండలేక విడిపోయిందని సమాచారం. అశ్విని భర్త ఎవరు? ఆయన ఏం చేస్తారనే విషయం ఎవరికీ తెలియదు. అలాగే అశ్వినికి పెళ్లైందన్న వార్తలో ఎంత వరకు నిజం ఉందో కూడా తెలియదు. అయితే ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం అశ్విని హౌస్లో రాణిస్తుంది. భోలే ఎలిమినేషన్ ఆమెను వేదనకు గురి చేసింది. భోలేతో ఆమె స్నేహం చేసింది. ఆమె రోజంతా భోలేతో గడుపుతారు. ప్రస్తుతం హౌస్లో 10 మంది ఉన్నారు. వారిలో అశ్విని ఒకరు.

 

View this post on Instagram

 

A post shared by Ashwini Sri (@ashwinii_sree)

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Nagarjuna

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper