
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు నెరవేర్చడంలో నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి పని చేస్తున్నారు. ప్రజల అవసరాలు తీర్చడంలో తలమునకలైపోతున్నారు. ఇప్పటివరకు ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేశారు. ఇంకా చేయాల్సి ఉందని చెబుతున్నారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో సంతోషం చూస్తున్నారు.
సంక్షేమ పథకాల ద్వారా రూ.95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు మొత్తంగా రూ. 1.31 లక్షల కోట్లు అందజేశారు. దీంతో ప్రజలకు నేరుగా ప్రయోజనం దక్కుతుంది. సంక్షేమమే తన ప్రయాణమని సీఎం జగన్ పదేపదే చెబుతున్నారు. దానికే పెద్దపీట వేస్తున్నారు. అనుక్షణం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు. ఏపీ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తూ ప్రజామోదాన్ని చూరగొంటున్నారు.
ఏపీలో పరిపాలన విషయంలో జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. కరోనా వేళ కూడా అన్ని ఆస్పత్రుల్లో కరోనాను ఆరోగ్యశ్రీ కింద చేర్చి వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు అధికారులను పురమాయిస్తున్నారు.
జగన్ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం శ్రమిస్తున్న ఆయన పదేళ్లపాటు పార్టీని నడిపించి కష్టాలు రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ముందుకు వెళుతున్నారని కొనియాడారు. సీఎం మరిన్ని కాలాల పాటు అధికారంలో కొనసాగాలని ఆకాంక్షించారు.