Vijay And Trisha: ప్రజలు ఓటు వేసి గెలిపించారు.. సమాజం మొత్తం చూస్తోంది.. మీడియా ప్రతి అడుగును గమనిస్తోంది అనే సోయి లేకుండా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
టీవీ లో వార్తలు చూద్దామంటే భయం. వార్తాపత్రిక తిరగ వేయాలంటే భయం. సోషల్ మీడియాలో నాయకుల ప్రసంగాలు వినాలంటే భయం. ఎందుకంటే ప్రజాప్రతినిధుల నోటికి అదుపు లేకుండా పోయింది. ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. కనీసం మనుషులను అనే విజ్ఞత కూడా రాజకీయ నాయకులకు లేకుండా పోయింది. అందువల్లే రాజకీయమంటే చులకనగా చూసే పరిస్థితి ఏర్పడింది. రాజకీయ నాయకులను బూతులకు పర్యాయపదాలుగా భావించే దుస్థితి నెలకొంది.
దేశం మొత్తం ఒక విధంగా ఉంటే .. తమిళనాడులో విచిత్రంగా ఉంటుంది. అక్కడి నాయకులకు కనీసం జ్ఞానం అనేది ఉండదు. ఆడవాళ్లకు ఎలాంటి మర్యాద ఇవ్వాలో కూడా వాళ్లకు తెలియదు. తాము ప్రజా ప్రతినిధులమనే ఇంగితం కూడా అక్కడి నాయకులకు ఉండదు. నిండు శాసనసభలో ఒక మహిళ ప్రజా ప్రతినిధిని చీర పట్టి లాగిన సంస్కృతి తమిళ రాజకీయాలది. ఇంతకంటే తమిళ నాయకుల గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు.
తాజాగా తమిళ ముఖ్యమంత్రి విజయ్.. త్రిష మీద అక్కడి ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ దారుణంగా కామెంట్లు చేశాడు. ఇవి తమిళ రాజకీయాలలో సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు మరోసారి రిపీట్ కావద్దని విజయ్ బలంగా నిర్ణయించుకున్నారు. అందువల్లే ఇటువంటి వ్యాఖ్యలు చేసే నాయకుల మీద ఉక్కు పాదం మోపడానికి సిద్ధమయ్యారు. అందువల్లే ఉదయనిది.. ఇతర డిఎంకె నేతలను తమిళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ద్వారా విజయ్ తమిళ నాయకులకు ఒక స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తుక్కు రేగిపోతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ప్రజా ప్రతినిధుల మనే గర్వంతో విర్రవీగి మాట్లాడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక రకంగా ఈ పరిణామం తమిళ రాజకీయ నాయకులకు గట్టి గుణపాఠం అని చెప్పవచ్చు. మరోవైపు ఎపిసోడ్ తర్వాత తమిళ రాజకీయ నాయకులు పూర్తిగా తమ ధోరణి మార్చుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో అడ్డగోలుగా మాట్లాడితే కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదంతం తర్వాత తమిళ ముఖ్యమంత్రి ఎటువంటి చట్టాలు తీసుకొస్తారు.. ఆడవాళ్లకు ఈ విధంగా రక్షణ కల్పిస్తారో చూడాల్సి ఉంది.