Homeఆంధ్రప్రదేశ్‌Bhogi teaser: తెర నిండా రక్తపాతం.. కనెక్ట్ అయ్యే కథ ఏది సామి

Bhogi teaser: తెర నిండా రక్తపాతం.. కనెక్ట్ అయ్యే కథ ఏది సామి

Bhogi teaser: మన తెలుగు చిత్ర దర్శకులకు ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఒక ఫార్ములా విజయవంతం అయితే దాని వెంట పరుగులు పెడుతుంటారు. కొత్త సీసాలో పాత సారా పోసి.. ఆ కాడికి తాము ఏదో కళాఖండాలను తీసినట్టు గొప్పలు పోతుంటారు. వాస్తవానికి ప్రేక్షకులకు కావాల్సిందేంటి.. ఎలాంటి కథలను ఆశిస్తున్నారు.. ఎలాంటి కొత్త దనం కోరుకుంటున్నారు.. పైగా ఇవి ఓటిటి రోజులు కాబట్టి.. ఎలాంటి సినిమాలు అంచనా వేస్తున్నారు.. అనే విషయాలను దర్శకులు మర్చిపోతున్నారు. ప్రస్తుతం […]

Bhogi teaser: మన తెలుగు చిత్ర దర్శకులకు ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఒక ఫార్ములా విజయవంతం అయితే దాని వెంట పరుగులు పెడుతుంటారు. కొత్త సీసాలో పాత సారా పోసి.. ఆ కాడికి తాము ఏదో కళాఖండాలను తీసినట్టు గొప్పలు పోతుంటారు. వాస్తవానికి ప్రేక్షకులకు కావాల్సిందేంటి.. ఎలాంటి కథలను ఆశిస్తున్నారు.. ఎలాంటి కొత్త దనం కోరుకుంటున్నారు.. పైగా ఇవి ఓటిటి రోజులు కాబట్టి.. ఎలాంటి సినిమాలు అంచనా వేస్తున్నారు.. అనే విషయాలను దర్శకులు మర్చిపోతున్నారు.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు పీరియాడికల్ డ్రామా అనే జబ్బు పట్టుకుంది. దానిని ఆధారంగా కథలు రాసుకుంటున్న దర్శకులు.. తెర నిండా రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. హింస.. ఎలివేషన్లు.. భాగాలతో హడావిడి చేస్తున్నారు. వాస్తవానికి ఎలివేషన్లు.. రక్తపాతం.. హింస చుట్టూ తిరుగుతూ కథను కంచిలో వదిలేస్తున్నారు. తాజాగా విడుదలైన శర్వానంద్ భోగి ట్రైలర్ కూడా కేరాఫ్ దసరా, ది ప్యారడైజ్ మాదిరిగానే కనిపిస్తోంది. ట్రైలర్ కట్ నిడివి కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ.. కథలో కనీసం కొంత భాగం కూడా చెప్పలేకపోయారు. పైగా శర్వానంద్ ఎలివేషన్లకే ప్రాధాన్యం ఇచ్చారు. అనుపమ పరమేశ్వరన్ ఇందులో కథానాయక పాత్ర పోషిస్తున్నారు. ఆమె పాత్ర ఈ సినిమాలో కీలకంగానే ఉన్నప్పటికీ.. ట్రైలర్ లో మాత్రం ఆశించిన స్థాయిలో చూపించలేకపోయారు.

నేటి కాలంలో ప్రేక్షకులు ట్రైలర్.. టీజర్ నుంచి చాలా అంచనా వేస్తున్నారు. సినిమా కథలో మలుపులు.. ఉత్కంఠలు ఇందులో చూపిస్తేనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. అలా కాకుండా ఏదో రొడ్డ కొట్టుడు విధంగా ట్రైలర్ వదిలిపెడితే జనం అంతగా చూసే రోజులు కావు ఇవి. పైగా శర్వానంద్ ఈ సినిమాలో పూర్తిగా రఫ్ లుక్ లో కనిపించారు. నయా మాస్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భోగి సినిమా విషయంలో ఒకటి మాత్రం క్లారిటీగా కనిపిస్తోంది. ఈసారి శర్వానంద్ ను మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం గట్టిగానే జరిగింది. కానీ మాస్ హీరో అనిపించుకోవాలని శర్వానంద్ చేసిన ప్రతిసారి కూడా ఎదురు దెబ్బ తగిలింది. అప్పట్లో రణరంగం.. ఆ తర్వాత మహా సముద్రం.. ఇలా అనేక సినిమాలు ఆయనను దెబ్బ కొట్టాయి. సంపత్ నంది దర్శకత్వంలో 1960 నాటి కథ.. మట్టి వాసనతో కూడిన ప్రపంచం.. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ సినిమా సాగుతున్నట్టు టీజర్ లో చూపించారు.

భూ స్వామ్య వ్యవస్థ.. అణచివేత.. గ్రామీణ ప్రజల కష్టాలు.. అధికార బలం.. తిరుగుబాటు వంటి అంశాలు ఈ సినిమాలో ముఖ్యంగా కనిపిస్తున్నాయి. కేవలం ఒక మాస్ యాక్షన్ సినిమాగా కాకుండా.. ఒక కాలాన్ని.. ఒక ప్రాంతాన్ని.. ఆ కాలంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కథలో భాగంగా చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఎక్కడో తేడా కొట్టినట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో రంగస్థలం.. వాసనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాలో కథబలంగా ఉండి.. నేపథ్యం అద్భుతంగా ఉండి.. పీరియడ్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్తుంది. లేకుంటే అస్సాం వెళ్తుంది. ఇక ఇందులో శర్వానంద్ పాత్రకు కమ్మరిగంగ అని పేరు పెట్టారు. చేతిలో ఆయుధాలు.. నరకడానికి తలలు.. కాల్చడానికి బీడీలు.. కొట్టడానికి మనుషులు గట్టిగానే ఆయనకు ఇచ్చారు. శర్వానంద్ చేసే ఈ పోరాటం విజయవంతం అయితే చాలాకాలం తర్వాత ఆయనకు ఉపశమనం లభిస్తుంది. లేకుంటే అంతే సంగతులు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper