CM Vijay: సోషల్ మీడియా లో నిత్యం ట్రెండింగ్ లో ఉండే పేరు తలపతి విజయ్. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా పగ్గాలు చేపట్టినప్పటి నుండి, విజయ్ పేరు దేశవ్యాప్తంగా ఒక రేంజ్ లో మారుమోగిపోతూ వస్తోంది. అంతే కాకుండా ప్రభుత్వ పరంగా ఆయన తీసుకునే నిర్ణయాలు, ప్రవేశ పెట్టిన పథకాలకు అత్యంత ప్రజాధారణ వస్తోంది. అయితే రీసెంట్ గా తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. సీఎం విజయ్ ఎన్నికల పిటీషన్ పై మద్రాసు హై కోర్టులో వేసిన దాఖలు ఇప్పుడు చర్చకు దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయ్ TVK పార్టీ ని స్థాపించినప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తో కొన్ని పాటలు కంపోజ్ చేయించుకున్నాడు. వాటికోసం ఆయన తమన్ కి 10 లక్షలు చెల్లించినట్టు ఆరోపణలు వచ్చాయి.
విజయ్ కి ప్రత్యర్థిగా పోటీ చేసిన ఆర్ డీ శేఖర్ ఈ విషయం పై కోర్టులు దాఖలు చేశారు. దీనిపై సీఎం విజయ్ కూడా కౌంటర్ పిటీషన్ దాఖలు చేశారు. తాను తమన్ కి ప్రచార గీతం కోసం 10 లక్షలు చెల్లించినట్లు నిరూపించే ఒప్పంద పత్రాలు, ఇన్వాయిస్ , రసీదు, చెల్లింపు వివరాలు ఏవి కూడా పిటీషన్ లో లేవని,కేవలం సమాచారాన్ని మాత్రమే అందులో పొందుపర్చారని, అది వాస్తవ చెల్లింపులకు ఆధారం కాదని విజయ్ కోర్టుకి వివరించాడు. అందువల్ల ఈ ఆరోపణలు కేవలం ఊహాజనితం మాత్రమే అని ఆయన కొట్టిపారేశాడు. అంతే కాకుండా శేఖర్ వేసిన పిటీషన్ లో విజయ్ ఎన్నికల ప్రచారానికి చట్టబద్దమైన 40 లక్షల వ్యయ పరిమితిని కూడా మించారని చెప్పుకొచ్చారు. దీన్ని కూడా విజయ్ తిప్పికొట్టారు.
నేను ఎంత ఖర్చు చేసానో ఆధారాలు లేకుండా శేఖర్ పిటీషన్ వేశారని, అదే విధంగా నాకు విదేశాల నుండి నిధులు వచ్చాయని, వాటిని ఎన్నికల్లో ఉపయోగించానని శేఖర్ అంటున్నారు, దానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని విజయ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇక ఈ పిటీషన్స్ పై కోర్టు విచారణ జరిపి తీర్పు ఎవరికీ అనుకూలంగా ఇస్తుందో చూడాలి.