Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: రోహిత్ గాలి పీల్చినా తప్పే అంటున్న నాగార్జున..ప్రతీ వారం నరకమే!

Bigg Boss 10 Telugu: రోహిత్ గాలి పీల్చినా తప్పే అంటున్న నాగార్జున..ప్రతీ వారం నరకమే!

Bigg Boss 10 Telugu: రోహిత్.. నువ్వు గాలి పీల్చడం తప్పు, అనే రేంజ్ లో నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున రెచ్చిపోయాడు. ఇది ఒక్క వారం కాదు , మొదటి వారం నుండి జరుగుతూ వస్తూనే ఉంది. మొదటి వారంలో త్రిగున్ అత్యంత నీచమైన కామెంట్స్ చేసినప్పుడు అతనికి ఫుల్ కోటింగ్ ఇస్తాడని అందరూ భావించారు. కానీ కట్ చేస్తే కప్పులు కడగను అన్నందుకు రోహిత్ కి అరగంట సేపు కోటింగ్ ఇచ్చారు. ఇదెక్కడి విడ్డూరం […]

Bigg Boss 10 Telugu: రోహిత్.. నువ్వు గాలి పీల్చడం తప్పు, అనే రేంజ్ లో నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున రెచ్చిపోయాడు. ఇది ఒక్క వారం కాదు , మొదటి వారం నుండి జరుగుతూ వస్తూనే ఉంది. మొదటి వారంలో త్రిగున్ అత్యంత నీచమైన కామెంట్స్ చేసినప్పుడు అతనికి ఫుల్ కోటింగ్ ఇస్తాడని అందరూ భావించారు. కానీ కట్ చేస్తే కప్పులు కడగను అన్నందుకు రోహిత్ కి అరగంట సేపు కోటింగ్ ఇచ్చారు. ఇదెక్కడి విడ్డూరం బాబు అని ప్రేక్షకులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. ముకేశ్ హౌస్ పనులు చేస్తున్నట్టు ఒక్కసారి కూడా కనిపించలేదు. కానీ అతన్ని ఇప్పటి వరకు ప్రాంసించలేదు. రెండవ వారం కూడా ఇంతే, సుధీర్ ని ‘పో బే’ అన్నవని అంటాడు నాగార్జున. వాస్తవానికి రోహిత్ ఆ మాట అనలేదు. అని ఉంటే వీడియో ప్లే చెయ్యాల్సింది కదా?, అది చెయ్యలేదు , ఎపిసోడ్ పూర్తి అయ్యాక రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో వీడియో ప్రూఫ్స్ తో నాగార్జున కి సమాధానం ఇచ్చారు.

ఇక ఈ వారం త్రిగున్ హౌస్ లో అన్నీ హద్దులు దాటి నోటికొచ్చినట్టు మాట్లాడాడు, అతనికి ఒక రేంజ్ లో కోటింగ్ ఇస్తాడని అనుకుంటే, చాలా సింపుల్ నాలుగు మాటలు మాట్లాడి వదిలేసాడు నాగార్జున. కానీ రోహిత్ తన స్నేహితుడు చరణ్ తో సరదాగా మాట్లాడిన మాటలు పట్టుకొచ్చి, నువ్వు బిగ్ బాస్ ని ఏమి పీకలేవు అన్నావని ఒక న్యారేటివ్ ని సెట్ చేసి రోహిత్ గ్రాఫ్ ని తగ్గించే ప్రయత్నం చేశాడు. చరణ్ ని సరదాగా అన్న మాటని రోహిత్ బిగ్ బాస్ ని అన్నట్టు ప్రాజెక్ట్ చేసి అతన్ని ఎమోషనల్ టార్చర్ చేశారు. ఒక వారం అంటే అనుకోవచ్చు, ప్రతీ వారం ఇదే అవుతోంది. సామాన్యుడు మరోసారి బిగ్ బాస్ టైటిల్ గెలవడం ఇష్టం లేకపోతే , నిన్న రోహిత్ ని డోర్స్ ఓపెన్ చేసినప్పుడు బయటకు గెంటేయొచ్చు కదా.

అతన్ని గెంటేస్తే , నాగార్జున కోరుకునే సెలబ్రిటీలకు కప్పు దక్కుతుంది. అలాంటి దానికి ఎందుకు ఒక మనిషిని ఎమోషనల్ గా ఇంతటి టార్చర్ కి గురి చేయడం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చెయ్యని తప్పుని తప్పు చేసినట్టు ఒప్పుకోమని నాగార్జున చాలా ఒత్తిడి చేసాడు , కానీ రోహిత్ వెనకడుగు వెయ్యలేదు , నన్ను పొరపాటున తప్పుగా అర్థం చేసుకొని ఉండుంటే దయచేసి క్షమించండి అని చెప్పడంతే. ఈ యాటిట్యూడ్ కారణంగానే అతనికి ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది అని విశ్లేషకులు సైతం కామెంట్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper