Homeజాతీయ వార్తలుTVK Vijay: టీవీకే విజయ్ మరో సంచలనం.. తమిళనాడు సీఎం గా త్రిష రెడీగా ఉండాలి..

TVK Vijay: టీవీకే విజయ్ మరో సంచలనం.. తమిళనాడు సీఎం గా త్రిష రెడీగా ఉండాలి..

TVK Vijay: నేను ఏదో విధంగా ముంబైకి రాలేదు. ముంబై నగరాన్ని మొత్తం ఏలేయ్యడానికి వచ్చా.. బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా.. అచ్చం ఈ డైలాగ్ మాదిరిగానే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్థానం సాగుతోంది. సరిగా కొంతకాలం క్రితం పార్టీని ఏర్పాటుచేసిన విజయ్.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా తన టీవీ కేను నిలబెట్టారు. భాగస్వామి […]

TVK Vijay: నేను ఏదో విధంగా ముంబైకి రాలేదు. ముంబై నగరాన్ని మొత్తం ఏలేయ్యడానికి వచ్చా.. బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా.. అచ్చం ఈ డైలాగ్ మాదిరిగానే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రస్థానం సాగుతోంది.

సరిగా కొంతకాలం క్రితం పార్టీని ఏర్పాటుచేసిన విజయ్.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా తన టీవీ కేను నిలబెట్టారు. భాగస్వామి పక్షాలతో ఒప్పందం ఖరారు చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏకధాటిగా పరిపాలన సాగిస్తున్నారు. తమిళనాడులో ద్రావిడ రాజకీయాలకు పూర్తిగా ముగింపు పలుకుతూ.. తనదైన శైలిలో పాలిటిక్స్ చేస్తున్నారు. వాస్తవానికి తమిళనాడులో ఇలాంటి పాలిటిక్స్ ఉంటాయని ఎవరు అంచనా వేయలేదు.

ఇటీవలనే వందరోజుల పరిపాలన పూర్తి చేసుకున్న విజయ్ సరికొత్త శకానికి తమిళనాడు రాష్ట్రంలో నాంది పలికారు. ఇక్కడితోనే విజయ్ ఆగిపోవడం లేదు. తన పరిపాలనకు సంబంధించిన గీటు రాళ్లను.. ఇతర అంశాలను జాతీయస్థాయిలో కూడా ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే నేషనల్ మీడియా విజయ్ అడుగుల మీద.. విజయ్ తీసుకుంటున్న నిర్ణయాల మీద ఫోకస్ పెట్టింది. గతంలో ఎన్నడు తమిళనాడు పాలిటిక్స్ మీద.. తమిళనాడు రాజకీయ నాయకుల మీద జాతీయస్థాయిలో మీడియా ఈ స్థాయిలో ఫోకస్ పెట్టిన దాఖలాలు లేవు.

విజయ్ ఇక్కడితోనే ఆగిపోవడం లేదు.. తన పరిపాలన.. దాని వెనుక ఉన్న కష్టాలను అన్నిటిని బయటపెడుతున్నాడు. తమిళనాడు ప్రభుత్వం తరఫున జాతీయ మీడియాలో భారీగానే ప్రకటనలు ఇస్తున్నాడు. అయితే ఇటీవల ఒక సంస్థ సర్వే నిర్వహించింది. దేశంలో నరేంద్ర మోడీ.. రాహుల్ గాంధీ తర్వాత ఆ స్థాయిలో ప్రజాధరణ కలిగిన నాయకుడు.. ఓటర్లను ప్రభావితం చేయగలిగే లీడర్ ఎవరు అని సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో విజయ్ కి అద్భుతమైన మార్కులు పడ్డాయి. ఏకంగా జాతీయస్థాయిలో విజయ్ మూడో స్థానంలో ఉండడం విశేషం.

ఈ సర్వేలో నరేంద్ర మోడీకి 48.7 శాతం.. రాహుల్ గాంధీకి 27.1%.. విజయ్ కి 9.2 శాతం మంది సపోర్ట్ చేయడం విశేషం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల కాలంలోనే విజయ్ పాపులారిటీ విపరీతంగా పెరిగింది. విజయ్ తర్వాతి స్థానాలలో మమతా బెనర్జీ 2%.. అఖిలేష్ అభిజిత్ దీప్కె 1.3.. అరవింద్ కేజ్రీవాల్ 1.2 శాతంతో విజయ్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు.. విజయ్ ఒకవేళ దేశ రాజకీయాల్లోకి వెళితే.. త్రిష ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper