Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda And Rashmika Wedding: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వచ్చే నెలలోనే..ముహూర్తం తేదీ...

Vijay Deverakonda And Rashmika Wedding: విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి వచ్చే నెలలోనే..ముహూర్తం తేదీ ఎప్పుడంటే!

Vijay Deverakonda And Rashmika Wedding: టాలీవుడ్ లో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) లు ప్రేమించుకుంటున్నారు, త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని. గత మూడు నాలుగేళ్లుగా ఈ వార్త వినిపిస్తూనే ఉంది. విజయ్ దేవరకొండ మొదట్లో ఫేక్ న్యూస్ అని కొట్టి పారేసేవాడు. కానీ ఇప్పుడు అసలు స్పందించడం లేదు. ఇక రష్మిక అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ […]

Vijay Deverakonda And Rashmika Wedding: టాలీవుడ్ లో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) లు ప్రేమించుకుంటున్నారు, త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని. గత మూడు నాలుగేళ్లుగా ఈ వార్త వినిపిస్తూనే ఉంది. విజయ్ దేవరకొండ మొదట్లో ఫేక్ న్యూస్ అని కొట్టి పారేసేవాడు. కానీ ఇప్పుడు అసలు స్పందించడం లేదు. ఇక రష్మిక అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం పై సమయం వచ్చినప్పుడు నేనే మాట్లాడుతాను అని చెప్పుకొచ్చింది. అంటే ఆ వార్త నిజమే అని అనధికారికంగా రష్మిక ఒప్పుకున్నట్టే. ఈ జంటకు గత ఏడాది నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఫిబ్రవరి నెలలో పెళ్లి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపించిన వార్త. కానీ ఇప్పుడు ఆ వార్త నూటికి నూరు శాతం నిజమే అని తెలుస్తోంది.

వచ్చే నెల 26న , అనగా ఫిబ్రవరి 26న ఈ క్రేజీ జంట మూడు ముళ్ల బంధం తో శాశ్వతంగా ఒక్కటి కాబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యిందట. త్వరలోనే ఈ జంట ఈ విషయాన్నీ అధికారికంగా అభిమానులకు ప్రకటించే అవకాశం ఉంది. ఈ వివాహాన్ని ఉదయ్ పూర్ లో జరిపించనున్నారు అట. నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పెళ్లి ఉదయ్ పూర్ లోని ఒక ప్యాలస్ లో ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే ప్యాలస్ లో ఈ క్రేజీ జంట వివాహం కూడా జరగబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పెళ్ళికి టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు తక్కువగానే హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇరు కుటుంబ సభ్యులు, అదే విధంగా ఇద్దరికీ ఎంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వివాహ మహోత్సవానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

గీత గోవిందం చిత్రం తో వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా పెద్ద హిట్ కూడా అయ్యింది. అప్పట్లో ఏర్పడిన స్నేహం, ‘డియర్ కామ్రేడ్’ చిత్రం తో ప్రేమగా మారింది. ఇక ఆ తర్వాత కొన్నేళ్ల నుండి ఒకే ఇంట్లో ఉంటూ డేటింగ్ చేస్తున్న ఈ చిత్రం, రీసెంట్ గా కలిసి ‘రణబలి’ చిత్రం లో హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో కూడా విడుదలై అద్బుత్యమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. వచ్చే నెలతో ఈ సినిమాలోని రష్మిక పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అవుతుందట. అందుకే పెళ్ళికి సిద్దమయినట్టు తెలుస్తోంది. మరి పెళ్లి తర్వాత రష్మిక సినిమాలు చేస్తుందా , లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper